Home / NATIONAL / సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం…!!

సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం…!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో వ‌ణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని, సెప్టెంబ‌ర్‌లోనే త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌నలు కాంగ్రెస్ పార్టీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అయింది.

తాజాగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ లో అభ్యర్థుల ప్రకటన కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ సభ కంటే భారీగా మేము సభ ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. సెప్టెంబర్ లో రాహుల్ మరోసారి రాష్ట్రానికి వస్తారని, బస్సు యాత్రలో అప్పుడు రాహుల్ పాల్గొంటారు. బస్సు యాత్రను మరో రెండు మూడు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామ‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మీడియా ఆయ‌న దృష్టికి తీసుకువెళ్ల‌గా…రాహుల్ పార్టీ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని ఆయ‌న అన్నారు.

అయితే, గులాబీ ద‌ళ‌ప‌తి వెల్ల‌డించి అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌, భారీ బ‌హిరంగ స‌భ కాంగ్రెస్ పార్టీ క‌ల‌వ‌రానికి కార‌ణం అయింద‌ని, అందుకే టీఆర్ఎస్ పార్టీకి పోటీగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌, బ‌హిరంగ స‌భ పేరుతో హ‌డావుడికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat