టీమిండియాలో ప్రకంపనలు.. విరుచుకుపడతారా.? మాటలు పడతారా.? – Dharuvu
Home / 18+ / టీమిండియాలో ప్రకంపనలు.. విరుచుకుపడతారా.? మాటలు పడతారా.?

టీమిండియాలో ప్రకంపనలు.. విరుచుకుపడతారా.? మాటలు పడతారా.?

గత కొంతకాలంగా టీఇండియా వైఫల్యం పై మాజీ క్రికెర్టేర్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రిని వెంటనే తొలిగించాలని అభిమానుల డిమాండ్ చేస్తున్నారు. ఇది అలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోచ్ పిచ్ కి తగ్గటుగానే మన బాట్స్మన్ సమర్ధవంతంగా ఎదుర్కుంటారని పేర్కున్నారు. కానీ మన బాట్స్ మెన్ చేతులెత్తేయడంతో జరిగిన రెండవ టెస్ట్ లో కూడా భారీ తేడాతో ఓడిపోయారు. దీనికి కచ్చితంగా కోచ్ సమాధానం ఇచ్చుకోవాలని మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులంతా అభిప్రాయపడుతున్నారు.

అయితే విరాట్ కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఇకనైన మేల్కొని తమ పేలవమైన ఫామ్ ని వదిలి బాట్స్మాన్లు ప్రత్యర్ధులు పై విరుచుకుపడాలని, టీంఇండియా అల్ల్రౌండ్ షో తో మెరుగైన ఆటతీరును కనపర్చాలని మాజీ విశ్లేషకులు, సీనియర్లు, క్రికెట్ అభిమానులు కోరుకుంటునారు. ఇకనైనా మన టీం సభ్యులు తమ ఆటతీరును మెరుగుపరచుకుంటారా లేకా అంచనాలను వమ్ము చేస్తారా అనేది వేచి చూడాలి.