Home / 18+ / బీకాంలో ఫిజిక్స్‌.. జ‌యంతికి.. వ‌ర్ధంతి శుభాకాంక్ష‌లు త‌ర‌హాలో.. మరో కొత్త‌..!

బీకాంలో ఫిజిక్స్‌.. జ‌యంతికి.. వ‌ర్ధంతి శుభాకాంక్ష‌లు త‌ర‌హాలో.. మరో కొత్త‌..!

దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిని తానే అంటాడు.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ చేతికి మైక్ దొరికిన‌ప్పుడ‌ల్లా ప్ర‌సంగాల‌తో ఊద‌ర‌గొడుతుంటారు.. అంతేకాడు, అంత అనుభ‌వాన్ని మాట‌లు మార్చ‌డంలో ఉప‌యోగిస్తుంటారు.. ఆ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాలుగేళ్లలో 40 మాట‌లు మార్చారు.. సొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టారు.. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.? సీఎం చంద్ర‌బాబు అనే స‌మాధానం ఇస్తున్నారు ఏపీ ప్ర‌జ‌లు.

అయితే, సీఎం చంద్ర‌బాబు తీరు అలా ఉంటే.. ఆయ‌న కుమారుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తీరు మ‌రోలా ఉంటుంద‌ని, జ‌యంతికి వ‌ర్ధంతి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం.. వ‌ర్ధంతికి జ‌యంతి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం లోకేష్‌కే చెందింద‌న్న మాటను ఇప్ప‌టికే ప‌లు ప్ర‌ముఖ వార్తా ప‌త్రిక‌లు ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు, దేశంలో అత్యంత అవినీతి పార్టీ టీడీపీయేన‌ని, టీడీపీకి ఓటేస్తే ఏపీ స‌ర్వ‌నాశ‌నం అవుతుందంటూ లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు.. ఒకానొక స‌మ‌యంలో ఏపీలో సంచ‌ల‌న‌మ‌య్యాయి.

ఇప్పుడు నారా లోకేష్ దారిలోనే.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌యంతి సంద‌ర్భంగా వ‌ర్ధంతి శుభాకాంక్ష‌లు చెప్పిన నారా లోకేష్‌లానే.. ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ స‌ర్కార్ రిప‌బ్లిక్ డే శుభాకాంక్ష‌లను తెలిపింది. ఇంత‌కీ ఈ త‌తంగ‌మంతా ఎక్క‌డ జ‌రిగింద‌నేగా మీ డౌట్‌. అదేనండీ.. మ‌న ఏపీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో. ఏపీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ కుడి వైపున జాతీయ జెండాను ఉంచి.. జెండాపై హ్యాప్పీ ఇండిపెండెన్స్ డే బ‌దులుగా.. హ్యాప్పీ రిప‌బ్లిక్ డే అంటూ ఇంగ్లీషు అక్ష‌రాల‌ను ఉంచ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా, బీకాంలో ఫిజిక్స్‌, జ‌యంతికి వ‌ర్దంతి శుభాకాంక్ష‌లు చెప్పే మంత్రులు ఉన్న ప్ర‌భుత్వంలో.. ఇలాంటివి చూసి ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటూ సోష‌ల్ మీడియాలు నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat