Home / ANDHRAPRADESH / వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో జ‌రుగుంటే..వ‌దిలిపెట్టేదేనా ? చీల్చి చెండాడి భ‌య‌క‌రంగా సీన్ క్రియేట్

వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో జ‌రుగుంటే..వ‌దిలిపెట్టేదేనా ? చీల్చి చెండాడి భ‌య‌క‌రంగా సీన్ క్రియేట్

భారత దేశమంతా జై భారత్ మాట నినాదం తో నిన్న స్వాతంత్ర దినోత్సవం పండగ చేసుకొన్నారు. పేద నించి గొప్ప వరకు తమకు తోచిన విధంగా జండా పండగ చేసుకున్న వేళ…రాజకీయ నేత లు మాత్రం చాలా బిజీ బిజీ గా గడిపారు. జండా ఎగరవేయటం లాంటి ప్రోగ్రాములతో గడిపారు.అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ ఆగ‌ష్టు 15వ తేదీ ఉద‌యం జెండా వంద‌నం చేయ‌టం వివాద‌మ‌వుతోంది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్న వేళ, లోకేశ్ తన నివాసంలో జెండా ఎగరవేసారట. ఆ విషయం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలియచేస్తూ మంత్రిని ఎద్దేవా చేశారు. దీని పై తన ట్విట్టర్ ఖాతాలో విజయసాయి రెడ్డి ఓ పోస్టు పెట్టారు. “ఈ దేశంలో ఆగస్టు 15 సందర్భంగా తన ఇంటిపై జెండాను ఎగురవేసిన ఏకైక మంత్రి లోకేష్ నాయుడు మాత్రమే అన్నారు.

మరో పక్క మంత్రి హోదాలో జెండా వంద‌నం చేయ‌టంలో త‌ప్పేమీలేదు. కానీ మంత్రి హోదాలో ఉండి, అది కూడా ఇంటి మేడ మీదే జెండా వంద‌నం చేయ‌టం క‌చ్చితంగా త‌ప్పనే అంటున్నారు అంద‌రూ. ఇంటి ముందు ప్రాంగ‌ణంలోనే జెండా ఎగుర‌వేయ‌వ‌చ్చు. లేదా స‌చివాల‌యంలో జ‌రిగే జెండా పండుగ‌కు హాజ‌రు కావ‌చ్చు. అతీ కాక‌పోతే రాష్ట్ర‌పార్టీ కార్యాల‌యంలో కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అటువంటిది అన్నింటినీ ప‌క్క‌న‌పెట్టేసి ఇంట్లో మేద‌మీదే అదికూడా భార్య నారా బ్రాహ్మ‌ణి, కొడుకు దేవాన్ష్ తో క‌లిసి పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తూ జెండా వంద‌నం చేయ‌టం వివాదాస్ప‌ద‌మైంది. ఇంకా లోకేష్ భార్య బ్రాహ్మ‌ణి పోలీసు గౌర‌వ వంద‌నం స్వీక‌రించ‌టం ఇంకా త‌ప్పైంది. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌విలో ఉన్నారు కాబ‌ట్టి లోకేష్ గౌర‌వ వంద‌నం స్వీక‌రిచటంలో ఎంటువంటి త‌ప్పులేదు. కానీ బ్రాహ్మ‌ణి ఏ విధంగా పోలీసు గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తారు. ఆమెకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కోడ‌లు, మంత్రి భార్య అన్న హోదా త‌ప్ప ఇంకేమీ లేదు. ఇంత త‌ప్పు జ‌రిగినా మెజారిటీ మీడియాకు ఇవేవీ ప‌ట్ట‌లేదు. అదే ఇటువంటి విష‌య‌మే ఏదైనా ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో జ‌రుగుంటే మీడియా వ‌దిలిపెట్టేదేనా ? చీల్చి చెండాడేసుండేది. జ‌గ‌న్ కానీ ఇంకెవ‌రైనా నేత‌లు కానీ ఏదైనా త‌ప్పు చేసుంటే దేశ‌ద్రోహానికి పాల్ప‌డినంత భ‌య‌క‌రంగా సీన్ క్రియేట్ చేసుండేదని సామన్య ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు ఉహించగలరు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat