హ్యాట్సాప్ జవాన్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో.. – Dharuvu
Home / NATIONAL / హ్యాట్సాప్ జవాన్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో..

హ్యాట్సాప్ జవాన్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో..

కేరళ రాష్ట్రంలో దాదాపు పదమూడు జిల్లాలు వరదలతో అలతాకుతలమవుతున్న సంగతి తెల్సిందే .. ఈ క్రమంలో వరదల దాటికి ఇప్పటివరకు మూడు వందల ఇరవై మంది మృతి చెందారు.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు.. ఈ క్రమంలో నెలలు నిండి ప్రసవ వేదనతో బాధపడుతున్న ఒక గర్భిణీను ఎయిర్ పోర్స్ ,ఎన్డీఆర్ఫ్ సిబ్బంది కాపాడిన ఒక సంఘటన ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ వీడియోను చూసిన వారంతా మీరే అసలైన నిజమైన హీరోలంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. అయితే ఇక్కడ మరో అశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సైనికులు కాపాడిన నలబై నిమిషాలకు ఆ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు ..