Home / ANDHRAPRADESH / ఊపందుకుంటున్న చేరికలు..టీడీపీ గుండెల్లో రైళ్లు.. వైఎస్ వర్ధంతి రోజునా.? జగన్ పాదయాత్ర ‌శ్రీకాకుళం చేరిన రోజునా.? 

ఊపందుకుంటున్న చేరికలు..టీడీపీ గుండెల్లో రైళ్లు.. వైఎస్ వర్ధంతి రోజునా.? జగన్ పాదయాత్ర ‌శ్రీకాకుళం చేరిన రోజునా.? 

కొండ్రు మురళీ మోహన్.. ఈయన ఓ మాజీమంత్రి. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర విభజన నేపథ్యంలో డోలాయమాన స్థితిలో పడిపోయిన చాలామందిలో కాంగ్రెస్ లీడర్లలో ఈయన కూడా ఒకరు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రుమురళి యువకుడు, విద్యావంతుడు, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన నియోజకవర్గాన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతోనే ఆయన ఈస్థాయికి వచ్చారనేది వాస్తవం. తాజాగా మురళి తన సహచరులు, అనుచరులతో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై చర్చించారట. ఎంతో వయసు తెలివి తేటలు ఉండగా, ప్రజా సేవ చేసిన అనుభవం, ఇంకా చేయాలనే తాపత్రయం ఉండడంతో ఇకా ఇలాగే ఉంటే లాభం లేదని కొండ్రుమురళి భావిస్తున్నారు. అందుకే ఆయన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. ఈక్రమంలో చేరికలతో 2019 సార్వత్రిక ఎన్నికలకు వేడి మొదలైంది. 2014లో తనపార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో జగన్ కు ఓ పాతికమంది దూరమయ్యారు. అయితేనేం తనతండ్రి అండగా ఉండి, ఆయన హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉండిపోయిన చాలామంది సీనియర్లు, జూనియర్లంతా ఇప్పుడు జగన్ సైగకోసం ఎదురు చూస్తున్నారు. దీంతో గతంలో రెండుసార్లు టీడీపీలో కాకలు తీరిన ప్రతిభాభారతిని ఓడించి, చాలా తక్కువ టైంలోనే బలమైన నేతగా దూసుకుపోయిన కొండ్రు జగన్ చెంతకు చేరనున్నారు. కాంగ్రెస్ లోనే ఉన్నా ఆపార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే పాల్గొంటూ వచ్చారు. 2019లో పోటీ నేపథ్యంలో ముందుగా టీడీపీలో చేరతారని వార్తలు వచ్చినా, అక్కడినుంచి పిలుపులు వచ్చినా ఆయన మనసు వైసీపీ వైపే ఉందట.. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పడంతోపాటు సీటు కూడా ఖరారు చేయించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మురళి వచ్చే నెలలో వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. సిక్కోలులో బలంగా ఉన్న టీడీపీని ఢీకొట్టాలంటే మురళి లాంటి బలమైన నేతలు అవసరమని వైసీపీ అధినేత కూడా భావిస్తున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా శ్రీకాకుళం చేరుకున్నప్పుడు కొండ్రు మురళి పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు మాత్రం ఈ సెప్టంబర్ 2న వైఎస్సార్ వర్ధంతిరోజు సందర్భంగా భారీగా వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి మురళి వైఎస్ జయంతిరోజున పార్టీలో చేరతారా లేక ప్రజాసంకల్పయాత్ర సిక్కోలు గడ్డపైకి చేరుకున్నప్పుడు చేరతారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సిఉంది. మొత్తమ్మీద ఉత్తరాంధ్రలో మరో బలమైన నేత వైసీపీలో చేరబోతున్నారని మాత్రం క్లారిటీ వచ్చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat