Home / 18+ / ఆదినారాయణ రెడ్డి జగన్ ను ఇష్టానుసారంగా తిట్టినా జగన్ భరించడానికి కారణం తెలుసా.?

ఆదినారాయణ రెడ్డి జగన్ ను ఇష్టానుసారంగా తిట్టినా జగన్ భరించడానికి కారణం తెలుసా.?

ఫిరాయింపు ఎమ్మెల్యే, జమ్మలమడుగు శాసనసభ్యుడు, జగన్ ప్రచారంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి, వైఎస్సార్ చిత్రపటంతో ప్రచారం చేసుకుని గెలిచి చంద్రబాబు ఆశీస్సులతో మంత్ర అయిన వ్యక్తే మంత్రి ఆదినారాయణ రెడ్డి తరచూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆదినారాయణ రెడ్డి వివిధ సందర్భాల్లో జగన్ ను ఉద్దేశించి ఏమన్నారంటే..

సీఎం చంద్రబాబునాయుడును అంతం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కుట్ర చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు చంద్రబాబు చనిపోవాలని జగన్ కోరుకొంటున్నారని ఆదినారాయణరెడ్డి విమర్శించారు

మరోసారి ఆదినారాయణ మాట్లాడుతూ జగన్‌ తీవ్రవాది మాదిరిగా ఆలోచనలు చేస్తున్నారన్నారు.

పాదయాత్రలోనే జగన్‌ జైలు యాత్ర చేయడం ఖాయమన్నారు.

తాను స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు అందజేసామని, తనపై జగన్‌ గానీ, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ చేయాలని సవాల్‌ చేశారు.

జగన్ తప్పుచేస్తుంటే చెప్పాల్సిన తల్లి విజయలక్ష్మి దొంగల్లో నంబర్‌వన్‌ అయిన కొడుకును సీఎం కావాలని ఆశీర్వదించడం విడ్దూరంగా ఉందన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దైవాంశసంభూతుడని ఆదినారాయణరెడ్డి వ్యంగంగా విమర్శించారు.

జగన్ ప్రత్యేక హోదా పోరాటంలో వెన‌క‌బ‌డి, బీజేపీతో లాలూచీ ప‌డ్డార‌న్నారు.

వైసీపీ భిక్షతో తామంతా గెలిచామని జగన్ చెప్తున్నారని, అలా అయితే విశాఖలో విజయమ్మ ఎందుకు ఓడిపోయిందో జగన్ సమాధానం చెప్పాలన్నారు.

ప్ర‌తీ శుక్ర‌వారం జ‌గ‌న్-విజ‌య‌సాయిరెడ్డిలు చేతులుక‌ట్టుకొని కోర్టుకు వెళుతున్నార‌న్నారు.

జ‌గ‌న్ ఆ ఊర‌పంది ఆలోచ‌న‌ల్ని మానుకోవాల‌ని పరుష వ్యాఖ్యలు చేసారు.

జగన్ కు సీఎం పదవి పిచ్చి పట్టిందని ఎద్దేవా చేసారు..

జగన్ అసెంబ్లీకి వెళ్తే అస్తమాటు బాయ్ కాట్ అంటారు..

కేసుల నుంచి బయటపడేందుకు జగన్‌ బీజేపీకి దగ్గరవుతున్నారు..

జగన్ ది ఉత్తుత్తి పాదయాత్ర.. ప్రజలను రెచ్చగొడుతున్నాడు..

అయితే తన వల్లే ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి తనను దారుణంగా విమర్శించినా జగన్ ఎప్పుడూ ఆదినారాయణ రెడ్డిని విమర్శించలేదు. దేవుడు అన్నీ చూస్తున్నాడని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ జగన్ ఊరుకుంటున్నారు. అయినా ఆదినారాయణ రెడ్డి విర్రవీగుతూ జగన్ పైనా, ఆయన కుటుంబ సభ్యుల పైనా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat