Home / ANDHRAPRADESH / 3దశాబ్ధాలు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మళ్లీ తన్నుకుంటారా.?

3దశాబ్ధాలు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మళ్లీ తన్నుకుంటారా.?

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి నాలుగునుంచి ఏడుశాతం వరకు ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఆచర్య ఉపకరిస్తుందనకుంటే.. తెలంగాణలో కేసీఆర్‌ విజయం ఖాయమని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా నమ్ముతున్నారు. ఇప్పడు తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 90 స్థానాల వరకు దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఈసంఖ్య పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైపే ప్రజలు ఉన్నారు. భారీగా ప్రజల వైఖరి మారితే తప్ప కేసీఆర్‌ను నిలువరించడం ప్రతిపక్షాల కూటమి వల్ల కాదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో చేయి కలపడం అవసరమా? అన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించుకోవాలి. తెలంగాణలె కేసీఆర్‌ ను నిలువరించాలనుకోవడం వేరు.. నిలువరించే పరిస్థితులు లేనప్పుడు ముందుకు వెళితే నష్టమే తప్ప లాభముండదు. గతఎన్నికలలో టీడీపీ తరఫున 15 మంది గెలిచినా ఒకరో ఇద్దరో మాత్రమే మిగిలారు. మిగతా వారంతా టీడీపీని వీడారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే ఒకరిద్దరు గెలవవచ్చు. కానీ ఆ ఇద్దరూ టీడీపీలో ఉంటారని, టీడీపీ బతికి ఉంటుందన్న గ్యారంటీ లేదు. అంతేకాదు తెలంగాణ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్‌ పార్టీకి దశాబ్దాలపాటు వైరం ఉంది. ఈ కారణంగా ఓట్ల బదిలీ కూడా అంత సజావుగా సాగదు. అదే సమయంలో తెలుగుదేశం తరఫున పోటీ చేద్దామని భావిస్తున్న పలువురు నాయకులకు వారి నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే ప్రత్యర్థులుగా ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమ మనుగడ కోసం కాంగ్రస్‌తో పొత్తుకు తహతహలాడుతున్న నేపధయంలో పొత్తులు చిత్తయినచోట్ల కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగినా ఆశ్చర్యంలేదు. కారణం దాదాపుగా 3దశాబ్ధాలపాటు కాంగ్రెస్ టీడీపీలు కత్తులు నూరుకున్నాయి. ఇప్పుడు మీరు కలిసి పనిచేయండి అంటే పెద్దనాయకుల మాదిరిగా గ్రామాల్లో ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి పొత్తుపై పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయమై చంద్రబాబు, కాంగ్రెస్ శ్రేణులు సరైన అంచనాకు రాకుండా ముందుకెళ్తున్న విధానం కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టలో పాలు పోసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat