Home / MOVIES / కౌశల్ ఆర్మీ రన్, కౌశల్ నినాదాలతో మార్మోగిన మాధాపూర్, స్టార్ ‍హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్..!

కౌశల్ ఆర్మీ రన్, కౌశల్ నినాదాలతో మార్మోగిన మాధాపూర్, స్టార్ ‍హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్..!

బిగ్ బాస్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ.. ఒక కంటెంస్టెంట్‌‌కి సపోర్ట్‌గా నిలుస్తూ బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె రన్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్‌ 2లో టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ ప్రారంభమైంది మొదలు ఆయన ప్రత్యర్థి కంటెస్టెంట్స్‌కు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఇక కౌశల్ ఎలిమినేషన్‌లో ఉంటే ఓట్లు కోట్ల వర్షం కురుస్తుందంటే.. ఇతగాడి ఫాలోయింగ్ అర్ధం చేసుకోవచ్చు.

 

ఈక్రమంలో వాక్‌కి పిలుపునిచ్చిన కౌశల్ ఆర్మీ సభ్యులు కూడా ఈ రేంజ్ స్పందనను ఊహించి ఉండరు. సగటు ప్రేక్షకుడే కాదు.. బిగ్‌బాస్ కూడా ఆశ్చర్యపోయేలా ఈ వాక్‌కి కౌశల్ అభిమానుల నుంచి మద్దతు లభించింది. బిగ్‌బాస్ హౌస్‌లోని సభ్యులంతా కౌశల్‌ని టార్గెట్ చేయడంతో కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు బాగా పెరిగిపోయింది. చివరకు బిగ్‌బాస్ షోను శాసించే స్థాయికి ఈ కౌశల్ ఆర్మీ పెరిగిపోయింది. హైదరాబాద్‌లో నిర్వహించిన 2కె వాక్‌కి స్థానిక అభిమానులు ఈ రేంజ్‌లో హాజరైతే… రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం షో చాలా రసవత్తరంగా మారుతోంది. అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే అవడంతో పోటీ బాగా పెరిగిపోయి ప్రేక్షకులకు ఈ షో మరింత ఆసక్తిగా తయారవుతోంది. కౌశల్ ఆర్మీ 2k వాక్‌కు వచ్చిన ఔత్సాహికులను చూసి ఓ రాజకీయ నాయకుడి ర్యాలీ నిర్వహించినా.. లేదా ఓ సినీ హీరో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా స్వచ్చందంగా ఇంత మంది రారు. కానీ కౌశల్ ప్రమేయం లేకుండా, పిలుపు ఇవ్వకుండానే ఇంత మంది రావడం నిజంగా ఆయన క్రేజ్ ఏంటో స్పష్టమవుతున్నదనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat