Home / MOVIES / మాధాపూర్ రన్ చూసి ఆశ్చర్యపోతున్న స్టార్ హీరోలు, స్వచ్ఛంధ కార్యక్రమాల్లో కౌశల్ ఆర్మీ..!

మాధాపూర్ రన్ చూసి ఆశ్చర్యపోతున్న స్టార్ హీరోలు, స్వచ్ఛంధ కార్యక్రమాల్లో కౌశల్ ఆర్మీ..!

బిగ్‌బాస్‌.. కొంత కాలం తర్వాత కౌశల్ కు ముందు కౌశల్ తర్వాత అనే రీతిలో బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఎంతో స్పీడుగా ఉంది. తాజాగా నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్‌ నిర్వహించింది. ఇంకా ఫైనల్‌ కు చేరడానికి చాలా ఎపిసోడ్‌లు మిగిలి ఉండగానే కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీస్ మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలనిరూపణ ద్వారా తెలియజేసేందుకు 2కే రన్ ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లో నిర్వహించిన ఈ వాక్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వచ్చేవారం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా జరిగిన ర్యాలీకి ఊహించని మద్దతు లభించింది. సగటు ప్రేక్షకుడే కాదు, బిగ్‌బాస్, సినీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయేలా ఈ వాక్‌కు విశేషమైన మద్దతు దక్కింది. బిగ్ బాస్ హౌస్‌లోని సభ్యులంతా కౌశల్‌ని టార్గెట్ చేయడం, అతనిని ఒంటరి చేసి గ్రూపులు కట్టడంతో కౌశల్‌కు అండగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. నిజాయితీ గల వ్యక్తికి లభించిన అభిమానులుగా వీరిని చెప్పుకోవచ్చు. క్రమేపీ కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు బాగా పెరిగిపోయింది. చివరకు బిగ్‌బాస్ షోను శాసించే స్థాయికి ఈ ఆర్మీ పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయంలేని కౌశల్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతుందంటే.. ఈ ప్రభావం బిగ్‌బాస్‌ షో‌లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్‌ ప్రారంభం నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేస్తాడు. ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏకాకిగా మారారు. హౌస్ మేట్స్ ఆయన వెంట లేకపోతేనేం.. కోట్లాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు. కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్‌లో ఎవ్వరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు కౌశల్. కేవలం కౌశల్ తో గొడవ పెట్టుకున్న కిరీటి, భానుశ్రీ, బాబుగోగినేని, దీప్తిసునయన, తేజస్వి, గణేష్, నందిని ఇలా వరుసగా ఎలిమినేషన్‌కి వెళ్లారంటే ఆయన ఫ్యాన్స్ ప్రభావం అర్ధం చేసుకోవచ్చు. గతంలో ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం, స్టార్ హీరోలను సైతం తలదన్నేలా స్వచ్ఛంధంగా అతనికోసం రోడ్లపైకి అభిమానులు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. కౌశల్ వ్యక్తిత్వం, నిజాయితీ అతనికి ఈ రేంజ్ తీసుకొచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat