Home / TELANGANA / ప్రగతి నివేదన, హుస్నాబాద్ సభలతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి.. కేసీఆర్ ను ప్రజలంతా మళ్లీ ఆశీర్వదిస్తారు

ప్రగతి నివేదన, హుస్నాబాద్ సభలతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి.. కేసీఆర్ ను ప్రజలంతా మళ్లీ ఆశీర్వదిస్తారు

సిద్దిపేటజిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభతో కాంగ్రెస్‌, టీడీపీలకు కనువిప్పు కావాలని టీఆర్ ఎస్ శ్రేణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని చెప్పడానికి ప్రగతినివేదన, హుస్నా సభల విజయోత్సవమే నిదర్శనమని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు స్వచ్ఛందగా వచ్చి హుస్నాబాద్‌ సభను విజయవంతం చేశారని, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతారన్నారు. ప్రతీ ఎన్నికల మాదిరిగా హుస్నాబాద్‌ ను సెంటిమెంట్‌గా భావించి సిఎం కెసిఆర్‌ ఇక్కడినుంచే ఎన్నికల సమర శంఖారావం పూరించారన్నారు. గతంలోనూ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించి ఘన విజయం సాధించామనే ఉత్సాహంలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించి రాష్ట్రంలో ఎన్నికలయాత్ర దిగ్విజయంగా జరిగేలా సీఎం కేసీఆర్‌ను పంపారని అన్నారు. ఈ సభతో కాంగ్రెస్‌ లో దిగులు మొదలయ్యిందని టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. తెలంగాణ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని, అభివృద్ధిలో ముందుండిదేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసారని కాంగ్రెస్‌ హయాంలో ఏనాడు కూడా ప్రాజెక్టులకు రూపకల్ప చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులకు రీడిజైన్‌ చేసి నిర్మించడంతో ప్రాజెక్టుల్లోకి నీరు రాబోతున్నదని అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హావిూ ఇచ్చి అమలు చేసిన ఘతన తమ టీఆర్ఎస్ పార్టీదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేని ప్రతిపక్ష నాయకులు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో గత 60ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లుగా అభివృద్ధి జరిగిందని కేసీఆర్ ను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో గతంలో మంచి మెజార్టీలతో తమ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించాలని, కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం భ్రష్టుపడుతుందన్నారు. ఇప్పటి వరకు తాగు, సాగునీరిచ్చే పనులు చివరిదశకు చేరుకున్నాయని, ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇవి మొత్తం ఆగిపోతాయన్నారు. నిరంతరం అభివృద్ధిని కాం క్షిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే ఆలోచనలో ముందుకు వెళితేనే మంచి జరుగుతుందన్నారు టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat