Home / ANDHRAPRADESH / కేంద్ర దర్యాప్తు సంస్థలనుంచి విశ్వసనీయ సమాచారం.. కేసుల ద్వారా ఇబ్బంది..!

కేంద్ర దర్యాప్తు సంస్థలనుంచి విశ్వసనీయ సమాచారం.. కేసుల ద్వారా ఇబ్బంది..!

గతంలో ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తానన్న నటుడు శివాజీ తాజాగా తనకు ప్రాణహాని వున్నదంటూ వ్యాఖ్యలు చేసాడు. తన ప్రాణాలు పోతాయన్న భయం తనకు లేదనీ, ఐతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికైనా తను సిద్ధమేనని చెప్పారు. ఏపీలో ఆపరేషన్ గరుడ రూటును భాజపా మార్చుకుని వేరే రూట్లో రాబోతోందన్నారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్రం పావులు కదుపుతోందని శివాజీ పేర్కొన్నారు. సోమవారమే ఆయనకు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందే అవకాశముందని, ఇది తనకు విశ్వసనీయంగా అందిన సమాచారమని ఇప్పుడు అది బయటికి పొక్కినందున నాలుగైదు రోజులు ఆలస్యంగా నోటీసులు జారీ చేయవచ్చునని చెప్పారు ‘ఓటుకు నోటు’ కేసు మనీ లాండరింగ్‌ పరిధిలోకి వస్తుందేమో పరిశీలించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు తెలంగాణ ఏసీబీ లేఖ రాసినట్లు కొంత ప్రచారం జరుగుతోంది. దీనిని ఎవరూ నిర్ధారించడంలేదన్నారు. ఓటుకునోటు కేసుపై శివాజీ ఆరోపణల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబును కేసులపరంగా ఇబ్బందిపెట్టే కార్యక్రమం మొదలైందని శివాజీ తెలిపారు. కేంద్రం పంజా విసరనుందని, వారిది సమయం చూసి దాడిచేసే నైజమని వారికి చట్టం చుట్టంలాంటిది. పైగా సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం తన దగ్గర ఉంది. కానీ దానిని బయటపెట్టనన్నారు. గతంలోనూ శివాజీ ఇదేమాదిరిగా హోదాను అడ్డుకుంటున్నందుకు ముఖయమంత్రి చంద్రబాబు ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఓ ఏడాదిపాటు కనిపించకుండా పోయారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat