Home / 18+ / కాంగ్రెస్‌కు ఝలక్‌…..టీఆర్‌ఎస్‌లోకి సీనియర్ నేత

కాంగ్రెస్‌కు ఝలక్‌…..టీఆర్‌ఎస్‌లోకి సీనియర్ నేత

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. 30 ఏళ్ళుగా రాజనాల శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.. గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదే విధంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇంచార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేసారు.

కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ లేక ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామన్న భావనలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది. శ్రీహరి తన అనుచరులతో కలిసి రెండు మూడు రోజుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని తెలిసింది. చీలికలు కారణంగా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోతుంది.ఇప్పటికే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి చేరడంతో షాక్ కి గురైయ్యారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat