Breaking News
Home / MOVIES / అద్బుతమైన విఎఫ్‌ఎక్స్‌ తో 2. ఓ టీజర్‌ విడుదల..!

అద్బుతమైన విఎఫ్‌ఎక్స్‌ తో 2. ఓ టీజర్‌ విడుదల..!

2. ఓ టీజర్‌:……..సినీ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రోబో 2.ఓ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదలైంది. దిగ్గజ దర్శకుడు శంకర్ , లైకా ప్రొడక్షన్స్ తో రూపొందుతున్న చిత్రం రోబో 2.ఓ . సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నటి అమీజాక్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. సుమారు 545 కోట్లతో , అద్బుతమైన విఎఫ్‌ఎక్స్‌ తో తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. రజినీకాంత్ మరోసారి సైంటిస్ట్ గా కనిపిస్తున్నారు. అక్షయ్ కుమార్ విలన్ గా అద్బుతమైన గ్రాఫిక్స్ తెరకెక్కించారు. రోబో ను మైమరపించేలా ఈ టీజర్ కనిపిస్తోంది. నవంబర్ లో ఈ చిత్రం రాబోతున్నట్లు ఈ సినిమా వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రేక్షకులకు ఇది ఒక అద్బుతమైన సినిమా.