Breaking News
Home / 18+ / టీఆర్‌ఎస్ మేనిఫెస్టో…..

టీఆర్‌ఎస్ మేనిఫెస్టో…..

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఈ నమవేశానికి మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్,ఎంపీ జితేందర్‌రెడ్డి, చందూలాల్, పద్మారావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, రాములు, గుండు సుధారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు పథకాలపై చర్చించారు.

2014 మేనిఫెస్టో కంటే మరింత ఆకర్షనియంగా ఉండేలా రూపొందించనున్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికీ అందేలా మేనిఫెస్టో ప్రవేశ పెట్టనున్నారు.హైదరాబాద్ అభివృద్ధి కి పెద్దపీట.ఇప్పటివరకు వరాలు అందని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం.గృహ నిర్మాణ పధకంలో మార్పు,పెన్షన్ పెంచే అవకాశం.