ప్రేమ జంట ఆత్మహత్య…. – Dharuvu
Home / 18+ / ప్రేమ జంట ఆత్మహత్య….

ప్రేమ జంట ఆత్మహత్య….

రంగారెడ్డి జిల్లా టంగుటూర్ లో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్ధల కారణంగా ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని టంగుటూరు గ్రామానికి చెందిన యల్లాశ్,లావణ్య గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు.వీరిద్దరూ వరసకు బావా మరదళ్ళు. అయితే వీరి మధ్య గత కొంత కాలంగా మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.

ప్రతి చిన్న విషయానికి గోడవపడేవారు. దీని కారణంగానే యల్లాశ్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బావ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెకుసున్న లావణ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్ర గాయాల పాలై మృతిచెందినది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేరసుకొని,పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.