కర్నూలు జిల్లా ప్యాపిలిలో జరిగిన ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి – Dharuvu
Home / 18+ / కర్నూలు జిల్లా ప్యాపిలిలో జరిగిన ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా ప్యాపిలిలో జరిగిన ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రత్యేకహోదా కోసం మహేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ సంఘటన తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, తప్పక ప్రత్యేకహోదా సాధిస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి యువత సంయమనం పాటించాలని ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మహేంద్ర రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చివుంటే అన్నకు ఉద్యోగం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ బాలుడు స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.