Home / 18+ / లండన్ లో ఘనంగా 6వ సారి హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ “గణపతి వేడుకలు మరియు నిమజ్జనం”

లండన్ లో ఘనంగా 6వ సారి హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ “గణపతి వేడుకలు మరియు నిమజ్జనం”

లండన్ నగరంలోని  హౌంస్లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు.

 

‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేష్ మహారాజ్ కి జై’ అంటూ లండన్ వీధులు దద్దరిల్లాయి, బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. సంస్థ అధ్యక్షుడు అశోక్ దూసరి ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల , నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డు ని వేలం పాటలో ధనంజయ్ పౌండ్స్ కి దక్కించుకోవడం జరిగింది.
అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు. అనంతరం థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.

 

ఎన్నారై టిఆర్ఎస్ &  అధ్యక్షుడు అశోక్ దూసరి, ఎన్నారై టిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు మరియు తెలంగాణా అసోసియేషన్ అఫ్ యునైటెడ్  కింగ్డమ్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు టాక్ అధ్యక్షురాలు శ్రీమతి పవిత్ర రెడ్డి కంది ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి , విక్రమ్ రెడ్డి రేకుల, సత్య చిలుముల , సత్యపాల్ పింగిళి , రామ రావు, శ్రీధర్ మెరుగు, శ్రీకాంత్ రెడ్డి, వంశీ రేక్నోర్, వెంకీ ,రాజేష్ వాకా ,నగేష్ ,రాకేష్ ,రవి కిరణ్ తో పాటు ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకులు చంద్రశేఖర్ సిక్కా, రవి ప్రదీప్ పులుసు, రవి రత్తినేని, శ్రీకాంత్ జెల్లా, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, ప్రశాంత్, సురేష్ గోపతి, గణేష్ పాస్తం మరియు టాక్ ముఖ్య నాయకులు స్వాతి బుడగం, రాకేష్ పటేల్, వంశీ పొన్నం, శుష్మున రెడ్డి, అపర్ణ, శైలజ, శ్రావ్య, స్వాతి, విజిత రెడ్డి, శ్రీ కాపు, స్థానిక ప్రవాసులు శ్రీకాంత్ జింకల, రమేష్, మధు గుల్యాగారి, , సందీప్, నగేష్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ధర్మ ముట్ట, చెర్రీ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat