Breaking News
Home / 18+ / ఏపీలో 3వేల మంది గిరిజనులు పోలీస్‌ స్టేషన్లపై దాడి…హై అలర్ట్

ఏపీలో 3వేల మంది గిరిజనులు పోలీస్‌ స్టేషన్లపై దాడి…హై అలర్ట్

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి అనుచరులు అరకు, డుంబ్రిగూడ పోలీస్‌ స్టేషన్లపై దాడి చేశారు.పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డుంబ్రి గూడ పోలీసుస్టేషన్‌కు నిప్పంటించారు.ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. డుబ్రీగుంట పోలీస్ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. స్టేషన్ లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని గెస్ట్ హౌజ్‌కు నిప్పు పెట్టారు.

గ్రామదర్శిని కార్యక్రమంలో సర్వేశ్వరరావు పాల్గొంటారని అరకు పోలీసులకు సమాచారం ముందే ఇచ్చినా కూడ పోలీసులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో వైపు మూడు రోజులుగా మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నా పట్టించుకోలేదని పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు.