Breaking News
Home / 18+ / తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…!

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…!

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.ఆక్లాండ్ లోని ఎప్సం బ్లడ్ బ్యాంకు సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈ శిబిరానికి అధిక సంఖ్యలో ఆక్లాండ్ లోని తెలంగాణ బిడ్డలు హాజరయ్యారు . రక్త దానం ప్రాణదానం అని ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు రక్త దాన శిబిరాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు ౩౦ మంది రక్త దానం చేయడం వలన 90 మందికి అత్యవసరమైన యూనిట్ల రక్తాన్ని ఇచ్చి ప్రాణదానం చేసినదానికి సమానం అని తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజిల్యాండ్ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డి పట్లోళ్ల తెలిపారు.రామ్మోహన్ దంతాల , రామ రావు రాచకొండ , కిరణ్ పోకల , రంగు మురళీధర్ , రాజు , సౌమ్య కిరణ్ ,విజేత రావు ,తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కళ్యాణ్ రావు కాసుగంటి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అసోసియేషన్ బతుకమ్మ సంబరాలకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 17 వరకు బతుకమ్మ నిర్వహిస్తున్నట్లుగానే తాము కూడా ఈ సంవత్సరం అన్ని రోజులు వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ జరుపుకుంటామని , ఈ వేడుకలకు తెలంగాణ ఆడ బిడ్డలందరు భారీగా తరలివచ్చి బతుకమ్మ ఆడి తెలంగాణా స్ఫూర్తిని న్యూజిల్యాండ్ వాసులకు తెలియచేయాలని కోరారు . అలాగే పె ద్ద బతుకమ్మ సందర్భంగా ఈ సారి పెద్ద ఎత్తున తెలంగాణ నుండి వచ్చి కళాకారులు న్యూజిల్యాండ్ ఆట పాటలతో అలరించడానికి కుతూహలంతో వున్నారని తెలిపారు. ఈ సారి బతుకమ్మ వేడుకలను ఆక్లాండ్ మహానగరం తో పాటు ఇతర ముఖ్య నగరాల్లో జరపబోతున్నామని తెలిపారు.