రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్‌ విజయం… – Dharuvu
Home / 18+ / రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్‌ విజయం…

రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్‌ విజయం…

అద్భుతంగా ముగిసింది ఆసియా కప్‌ . ఆఖరి బంతి వరకు అత్యంత రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్‌ విజయం సాదించింది. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ గెలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్‌ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్‌ ఏడోసారి ఆసియా కప్పును చేజిక్కించుకుంది. బంగ్లాదేశ్‌ వరుసగా మూడోసారి రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్‌ దాస్‌ (117 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ 3, జాదవ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ విజయానికి 50 ఓవర్లలో 223పరుగులు కావాలి. చివరి 14 ఓవర్లలో 63 పరుగులు కావాలి. ధోనితో పాటు కేదార్‌ జాదవ్‌ క్రీజ్‌లో ఉన్నాడు. అంతా భారత్‌కు అనుకూలంగానే సాగుతోంది. అయితే ధోని ఔట్‌ కాగా, జాదవ్‌ కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీంతొ బంగ్లాదేశ్‌ జట్టులో విజయంపై చిగురించాయి. అయితే జడేజా, భువనేశ్వర్‌ 45 పరుగుల భాగస్వామ్యం వాటిని తుంచేసింది. ఆఖరి బంతికి లెగ్‌బై ద్వారా సింగిల్‌ రావడంతో భారత్‌ విజయం ఖాయమైంది. లక్ష్యాన్ని భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (55 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లిటన్‌ దాస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, శిఖర్‌ ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యారు.