Home / 18+ / సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి హరీష్ రావు….

సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి హరీష్ రావు….

అన్నదమ్ముల్లా కలిసి పెరిగాం.అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నాం.ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన కలలు కంటున్న బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నాం.లక్షలాది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని తామిద్దరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 15 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాం.మంత్రి కేటీఆర్ పనితీరు, సిరిసిల్ల అభివృద్ధి పైన ప్రశంసలు కురిపించిన మంత్రి హరీష్ రావు.ఆత్మహత్యల సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారిందంటే పూర్తి క్రెడిట్ మంత్రి కేటీఆర్ ది.

బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో నియోజకవర్గ కీలక కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి హాజరైన మంత్రి హరీష్ రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడి ముందుకు పోతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో తాను కొనసాగిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధి వెనుక 30 సంవత్సరాల శ్రమ ఉన్నదని, అయితే 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని గత నాలుగేళ్లలో నే మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్లలో చేసి చూపించే ప్రయత్నం చేశారని అభినందించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ విజయవంతంగా తన శాఖను నిర్వహిస్తూనే మరోవైపు సిరిసిల్ల అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలిపారన్నారు. ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను తమ పరిధిలో తాము నిర్వహిస్తున్నామన్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్న మంత్రి హరీష్ రావు, మెజార్టీ విషయంలో ను పోటీపడి సిద్దిపేటను దాటేలా నియోజకవర్గ కార్యకర్తలందరూ కృషిచేయాలని కోరారు. తాము అభివృద్ధిలో పోటీ పడుతున్న తీరుగానే కార్యకర్తలు కూడా ఒకరికి ఒకరు పోటీపడి పెద్దఎత్తున ఓటింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలన్నారు.

 

గత నాలుగేళ్లలో సిరిసిల్ల ఎవరు గుర్తుపట్టలేనంత గొప్పగా మారిపోయిందని, ఒకవైపు పట్టణ అభివృద్ధితోపాటు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. ఒకవైపు కాలేశ్వరం నీళ్లు, మరొకవైపు టెక్స్టైల్ పార్క్ ద్వారా సిరిసిల్ల రానున్న రోజుల్లో పూర్తిగా రూపాంతరం చెంది సిరుల ఖిల్లా సిరిసిల్ల గా మారుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు ప్రతినిత్యం ఆత్మహత్యల వార్తలతో ఇబ్బంది పడిన సిరిసిల్ల ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు నేస్తూ వార్తలు నిలుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు లేవంటే ఆ క్రెడిట్ అంతా మంత్రి కేటీఆర్ దక్కుతుందని ఈ సందర్భంగా హరీష్ రావు తెలిపారు.

 

కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి హరీష్ రావు కి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని తెలిపారు. తాము సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. ఉద్యమ కాలం నుంచి కేవలం తెలంగాణ కోసం పనిచేసిన తాము, ఇద్దరం కలిసి ఇలా ఒకే క్యాబినెట్లో పనిచేసే అవకాశం లభించిందని… ఇదంతా తెలంగాణ ప్రజలు తమకు ఇచ్చిన ఒక సువర్ణవకాశంగా భావిస్తున్నామన్నారు. తామంతా లక్షలాది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు మాదిరి ముఖ్యమంత్రి గారు మరో పదిహేనేళ్లపాటు రాష్ట్రానికి నాయకత్వం వహించాలన్న కల కోసం పని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కెసిఆర్ కంటున్న బంగారు తెలంగాణ కల కోసం తామంతా సైనికుల్లా పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగానే కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీష్ రావు పరిగెత్తిస్తున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పరుగులెత్తుతూ ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన పనితీరు తమ నియోజకవర్గ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

 

ఈ కార్యకర్తల సమావేశంలో భాగంగా మంత్రి కేటీఆర్ మండలాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అయి , రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటిదాకా తాము చేసిన పనులను ప్రజలకు తెలిసేలా వివరించాలని, ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలని మంత్రి నియోజకవర్గ కార్యకర్తలకు సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat