Home / 18+ / ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఐటీ సోదాలు…వణుకుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఐటీ సోదాలు…వణుకుతున్న చంద్రబాబు

నిన్న విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని రియల్‌ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్‌ సంస్థల కార్యాలయాలపై గురి. ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సంస్థపై కొనసాగుతున్న దాడులు చేసారు.వివరాలు వెల్లడించడానికి నిరాకరించిన ఆదాయపు పన్ను అధికారులుఅయితే దాడులకు సంబంధించిన వివరాల్ని మాత్రం వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఐటీ శాఖ దాడులపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఇది రాష్ట్రంపై చేస్తున్న దాడిగా ఆయన సీరియస్ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించేందుకు ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. పెట్టుబడి దారుల్ని భయపెట్టడమే ఐటీ మాకుమ్మడి సోదాల లక్ష్యమన్నారు. కేంద్రానికి అధికార ఉగ్రవాదమంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇక సాక్షి పేపర్ ఐటీ దాడులకు సంబంధించిన వార్తను ప్రచురిస్తూ… ఐటీ శాఖ సోదాలతో చంద్రబాబులో ఇంత వణుకు ఎందుకంటూ ఓ ప్రత్యేక కథనాన్ని కూడా పబ్లిష్ చేసింది. గతంలో ఎప్పుడూ చంద్రబాబు ఇలా స్పందించలేదని పేర్కొంది. టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ సంస్థల్లో సోదాలు జరిగినప్పుడు సీఎం మాట్లాడలేదు. ఇప్పుడు బాబు తీవ్రంగా స్పందిస్తున్న తీరు చూసి టీడీపీ నేతలు… ప్రజలు, పార్టీ శ్రేణులు విస్తుపోతున్నారు.

రాష్ట్ర ఐటీ అధికారులతో సంబంధం లేకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన సుమారు 10 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు అర్ధరాత్రి దాటినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల మధ్యాహ్నం కల్లా సోదాలు పూర్తి చేశారు. వ్యాపార లావాదేవీలకు చెందిన విలువైన పత్రాలను ఐటీ అధికారులు తమవెంట తీసుకెళ్లారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat