తెలంగాణ సీఎంగా కేసీఆరే రావాలి… – Dharuvu
Home / 18+ / తెలంగాణ సీఎంగా కేసీఆరే రావాలి…

తెలంగాణ సీఎంగా కేసీఆరే రావాలి…

ఏపీ విడిపోతే.. తెలంగాణను చిమ్మంజీకట్లు కమ్ముకుంటాయనీ.. సమైక్య రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు! కానీ ఇప్పుడు చూడండి. వెలుగు రేఖలతో తెలంగాణ ఎట్లా విరాజిల్లుతున్నదో.. 24 గంటల ఉచిత విద్యుత్‌తో దేశానికే గర్వకారణంగా తెలంగాణ నిలుస్తున్నదనీ.. మల్లా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ సీఎం అయితేనే.. రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుంది.

దేశంలో ఒకప్పుడు వ్యవసాయరంగం 75% వాటా ఉండేది. కానీ నేడు అది 52% తగ్గింది. అందులో 40% కౌలురైతులే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా వరి బాగా పండే ప్రదేశాల్ని కేంద్రం పద్నాలుగు జోనల్స్‌గా ప్రకటించింది. వాటిలో దక్షిణాది రాష్ర్టాల నుంచి ఏపీలోని పశ్చిమగోదావరి, తమిళనాడు నుంచి తంజావూరు ప్రాతినిధ్యం వహించాయి. ఈ రోజున దక్షిణాదిలో వరి బాగా పండించే ప్రదేశాల్లో తెలంగాణలోని కరీనంగర్ జిల్లా చోటు దక్కించుకుంది. సరైన సమయంలో వర్షాలు కురువడం, రైతుల శ్రమకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయి.

ప్రచారం 14 రోజులు మాత్రమే:
అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం 14 రోజుల్లో ముగియనున్నది. ప్రస్తుతం ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికల ప్రక్రియ సులభంగా మారుతుండటంతో ఎక్కువ రోజులు సాగనీయడం లేదు. ఈసారి ప్రచారానికి కేవలం 14 రోజులు మాత్రమే సమయమిచ్చారు. నవంబర్ 22న నామినేషన్ ఉపసంహరణ అనంతరం అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు ఈసీ అనుమతిస్తుంది