తెలంగాణలో టీఆర్‌ఎస్సే అధికారం చేపడుతుందని స్పష్టం చేసిన‌ సర్వేలు….. – Dharuvu
Home / 18+ / తెలంగాణలో టీఆర్‌ఎస్సే అధికారం చేపడుతుందని స్పష్టం చేసిన‌ సర్వేలు…..

తెలంగాణలో టీఆర్‌ఎస్సే అధికారం చేపడుతుందని స్పష్టం చేసిన‌ సర్వేలు…..

తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని సర్వేలు స్పష్టం చేశాయి. సీ–వోటర్, టైమ్స్‌ నౌ, ఐటీటెక్‌ గ్రూప్‌ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేల ఆధారంగా ఓ నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం త్వరలో ఎన్నికలు జరిగనున్న ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, వాటిలో రెండు రాష్ట్రాలను ఈసారి కాంగ్రెస్‌ చేజిక్కించుకోనుంది. అదే జరిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు కాంగ్రెస్‌కు కొత్త శక్తి వస్తుంది.

 

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ద టీమ్‌ ఫ్లాష్, వీడీఏ అసోసియేట్స్‌ అనే రెండు సంస్థలు వేర్వేరుగా జరిపిన సర్వేలను విశ్లేషించిన అనంతరం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నారు. విశ్లేషణల ప్రకారం టీఆర్‌ఎస్‌ ఏకంగా 85 సీట్లు గెలవనుండగా, కాంగ్రెస్‌ కేవలం 18 సీట్లతో రెండో స్థానంలో నిలవనుంది. ఎంఐఎం 7, బీజేపీ 5, ఇతరులు నాలుగు సీట్లు గెలవొచ్చని అంచనా.