Breaking News
Home / 18+ / ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం….కేటీఆర్

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం….కేటీఆర్

బంజారాహిల్స్‌లో మహారాజ శ్రీ అగ్రసేన్  జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించేవారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ హయాంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాలకు పెద్దపీట వేస్తోంది. వ్యాపారులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలకు ఇతోధిక ప్రోత్సాహకాలు అందిస్తోంది. వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాం. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు సత్వర అనుమతులు ఇస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం అవసరమని కేటీఆర్ కోరారు. జయంతి వేడుకల్లో తమిళనాడు మాజీ గవర్నర్ కోణిజేటి రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.