సిద్ధిపేట జిల్లాలోని జగదేవపూర్ మండలంలో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జంగంరెడ్డిపల్లి, ఛాటపల్లి, తీగుల్‌నర్సాపూర్‌లో మంత్రి ప్రచారం చేశారు. వచ్చే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు.
రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని వివరించారు. ర్యాలీలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలతో భారీగా తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కే ఓటేస్తామని గ్రామస్తులంతా ఈ సందర్భంగా తెలియజేశారు.