వైఎస్‌ జగన్‌ 283వ రోజు ప్రజాసంకల్పయాత్ర….. – Dharuvu
Home / 18+ / వైఎస్‌ జగన్‌ 283వ రోజు ప్రజాసంకల్పయాత్ర…..

వైఎస్‌ జగన్‌ 283వ రోజు ప్రజాసంకల్పయాత్ర…..

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు (బుధవారం) ఉదయం 283వ రోజు పాదయాత్ర జిన్నాం నుంచి ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గం అంతా జనంతో కిక్కిరిసి పోయింది. వైఎస్‌ జగన్‌ ప్రజాసమస్యలు సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గజపతినగరం నియోజకవర్గంలోని లింగాల వలస, లోగిస క్రాస్‌, కొత్త శ్రీరంగ రాజపురం, నారాయణ గజపతిరాజపురం, గజపతినగరం వరకు నేడు పాదయాత్ర సాగనుంది. గజపతినగరంలో ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిచనున్నారు.