Home / 18+ / విద్యార్థి సంఘాల నేతలకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ మొండిచేయి

విద్యార్థి సంఘాల నేతలకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ మొండిచేయి

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా.. తెలంగాణ శౌర్యాన్ని చూపి న కాకతీయ.. నాటి, నేటితరం నాయకుల్లో ఎక్కువ మంది ఈ యూనివర్సిటీల్లో నాయకత్వలక్షణాలను పుణికిపుచ్చుకున్నవారే. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేకమంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. వారి త్యాగాలను గుర్తించిన టీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అనేకమంది విద్యార్థి సంఘం నాయకులకు రాజకీయంగా భరోసా కల్పించింది. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడంతోపాటు, అధికారంలోకి వచ్చాక అనేక నామినేటెడ్ పోస్టుల్లోనూ వారికి అవకాశం కల్పించింది. కానీ, విద్యార్థి సంఘాలను రెచ్చగొడుతూ రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్టులు తమకు కల్పిస్తున్న అవకాశాలేమీలేవని విద్యార్థి నాయకులు పెదవి విరుస్తున్నారు. ఈసారి ఎన్నికల్లోనైనా ఆయా పార్టీల తరఫున పోటీచేయాలనే విద్యార్థి సంఘం నేతల ఆశలకు పార్టీలన్నింటితో కలిసి ఏర్పడుతున్న మహాకూటమి ఆదిలోనే గండికొడుతున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయమే ప్రధాన కేంద్రంగా పార్టీని విస్తరించుకోవాలనుకుంటున్న తెలంగాణ జనసమితి సైతం విద్యార్థినాయకులకు కనీసస్థాయిలో భరోసా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపై మూడు నాలుగు సీట్లకు పరిమితమవుతున్న టీజేఎస్ తరఫున తమకు పోటీచేసే అవకాశమే లేదని వారు తీవ్ర నిరాశలో ఉన్నారు.

 

ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో మహాకూటమి నేతలు విద్యార్థిసంఘాల నాయకుల సమావేశంలో వ్యవహరించిన తీరు ఓయూలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకుల మాటలు తీ వ్ర నిరాశకు గురిచేశాయని విద్యార్థి సంఘం మహిళా నాయకురాలు పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులకు ఈసారి అవకాశం ఇస్తామనే భరోసా ఇవ్వకుండా.. గెలుపు గుర్రాలు కావాలి, ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడతారో చెప్పండి అంటూ అడగడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున జనగామ నుంచి పోటీచేయడానికి ఓయూ విద్యార్థి విభాగానికి చెందిన బాలలక్ష్మి, బెల్లంపల్లి నుంచి దుర్గం భాస్కర్, సత్తుపల్లి నుంచి కే మానవతారాయ్, మానకొండూరు లేదా ధర్మపురి నుంచి దరువు ఎల్లన్న, కంటోన్మెంట్ నుంచి క్రిశాంక్ తదితరులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కానీ, వారు ఆశిస్తున్న ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే మహాకూటమి అభ్యర్థులు సిట్టింగ్‌లు, లేదా మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడం ఖాయమైంది. పొత్తు కుదిరితే సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, మానకొండూరు నుంచి ఆరెపల్లి మోహన్, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య లేదా వారి కుటుంబసభ్యులలో ఒకరికి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే.

 

ఇక తెలంగాణ జన సమితి నుంచి టిక్కెట్లను ఆశిస్తున్న ఓయూ విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంది. కానీ ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితిని చూసి విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆ పార్టీ తరఫున చెన్నూరు నుంచి మందాల భాస్కర్, ఎల్లారెడ్డి నుంచి మిద్దెల రమేశ్‌ముదిరాజ్, జహీరాబాద్ నుంచి ఆశప్ప, వరంగల్ ఈస్ట్ నుంచి ఓరుగంటి కృష్ణ, కల్వకుర్తి నుంచి ఆంజనేయులు తదితరులు టికెట్లు ఆశిస్తున్నట్టు సమాచారం. టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు పుల్లారావు యాదవ్ ఖమ్మం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కానీ అక్కడి నుంచి ఇప్పటికే నామా నాగేశ్వర్‌రావు అభ్యర్థిత్వం ఖరారైనట్టు ప్రచారం జరుగుతున్నది. అసలే అవకాశాలు ఇవ్వడం లేదు.. ఆ పైన మహాకూటమి పొత్తుల సీట్ల సర్దుబాటులలో తమకు పాట్లు తప్పవని విద్యార్థి వర్గం తీవ్ర నిరాశలో ఉన్నది. గత ఎన్నికల్లోనూ విద్యార్థి నాయకులకు కొందరికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో మొండిచేయి చూపిందని వారు పేర్కొంటున్నారు.
విద్యార్థి నేతలకు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat