న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా – Dharuvu
Home / 18+ / న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా

న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా

ఓ దేశ ప్రధాని మొదటిసారి మన బతుకమ్మ ఆడారు. శుక్రవారం న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నారైలు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా పాల్గొన్నారు. నుదుట బొట్టు పెట్టుకొని, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు. అంతకుముందు బతుకమ్మకు పూజచేశారు. ప్రపంచంలోనే బతుకమ్మ వేడుకల్లో ఓ దేశ ప్రధాని స్వయంగా పాల్గొనడం ఇదేమొదటిసారి అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించి బతుకమ్మ ఆడిన న్యూజిలాండ్ ప్రధానికి ఆయన వ్యక్తిగతంగా, తెలంగాణ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా న్యూజిలాండ్‌లో తెలుగువారు నివసిస్తున్నారని, వారి ఆహ్వానాన్ని మన్నించి ప్రధాని స్థాయిలో ఉండి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. బతుకమ్మ వేడుకలు నిర్వహించిన న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్‌ను అభినందించారు. ఇదిలాఉంటే ప్రధాని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.