తెలంగాణలో విన్నూత‌ రీతిలో బ‌తుక‌మ్మ‌… – Dharuvu
Breaking News
Home / 18+ / తెలంగాణలో విన్నూత‌ రీతిలో బ‌తుక‌మ్మ‌…

తెలంగాణలో విన్నూత‌ రీతిలో బ‌తుక‌మ్మ‌…

తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కి మహిళలు చక్కర్లు కొట్టారు. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో గురువారం పారా మోటరింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరినీ అబ్బురపరిచారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, షీటీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీత భగవత్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమని, ప్రకృతి ఆరాధనకు, ప్రేమ, ఆప్యాయతలకు నిలయమని అభిప్రాయపడ్డారు.