వైయస్ జగన్ మీద దాడికి నిరసనగా ఏపీలో దర్నాలు – Dharuvu
Breaking News
Home / 18+ / వైయస్ జగన్ మీద దాడికి నిరసనగా ఏపీలో దర్నాలు

వైయస్ జగన్ మీద దాడికి నిరసనగా ఏపీలో దర్నాలు

ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ పై హత్యాయత్నం జరగడం పట్ల వైసీపీ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే.. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలోనే వైఎస్‌ జగన్‌పై కత్తితో దాడి జరిగిందని విమర్శించారు. ఇటువంటి హేయమైన చర్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

మహానేత రాజశేఖర రెడ్డి లేని లోటునే భరించలేకపోతుంటే.. జగన్‌ను చంపేందుకు కుట్ర జరగడం దారుణమంటూ పలువురు కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇందులో బాగాంగానే కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ అభిమానులు ఆందోళనలు చెపట్టారు. వైయస్ జగన్ మీద దాడికి నిరసనగా కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు పత్తికొండ వైసీపీ మహిళ నేత..కంగాటి శ్రీదేవి..పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తదితరులు పాల్గోన్నారు