Breaking News
Home / 18+ / అత్యంత భద్రతతో ఉండే ఎయిర్ పోర్టులోనే జగన్ పై దాడి.. హత్యకు కుట్ర వెనుక ఎవరి హస్తం ఉంది.?

అత్యంత భద్రతతో ఉండే ఎయిర్ పోర్టులోనే జగన్ పై దాడి.. హత్యకు కుట్ర వెనుక ఎవరి హస్తం ఉంది.?

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖ విమానాశ్రయంలో జగన్ పై ఓ వెయిటర్ దాడిచేసాడు. జగన్ విమానాశ్రయం లాంజ్ లో కూర్చొని ఉండగా ఘటన జగన్ పై కోడి పందేలలో వినియోగించే కత్తితో దాడిచేసారు. అప్రమత్తమైన పోలీసులు వెయిటర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఎయిర్ పోర్టులో ప్రథమ చికిత్స తరువాత జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. లాంజ్ లో కూర్చొన్న జగన్ వద్దకు వచ్చి 160 సీట్లు వస్తాయా సార్ అని జగన్ ను పలకరించగా.. జగన్ చిరునవ్వు నవ్వారు.. ఈలోపే వెయిటర్ కత్తితో జగన్ మెడపై దింపేందుకు ప్రయత్నించగా, అది భుజంపై దిగింది.

అత్యంత భద్రతతో ఉండే ఎయిర్ పోర్టులోనే జగన్ పై దాడి జరగడం పట్ల తమ అధినేత హత్యకు కుట్ర వెనుక పెద్దల హస్తం ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు జగన్ పై దాడి చేసిన కత్తికి విషపు రసాయనం పూసారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో హైదరాబాద్ కు జగన్ రానున్న నేపధ్యంలో మరింత భద్రత కట్టుదిట్టం చేసారు. వైఎస్సార్ ను పోగొట్టుకుని ఇప్పటికీ ఆవేదన చెందుతున్న అభిమానులు తాజాగా జగన్ పై జరిగిన హత్య ఘటనతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.