Home / INTERNATIONAL / తెరాస న్యూ జీలాండ్ శాఖ ఎన్నికల ప్రచార బేరి ప్రత్యేక సమావేశం

తెరాస న్యూ జీలాండ్ శాఖ ఎన్నికల ప్రచార బేరి ప్రత్యేక సమావేశం

తెరాస న్యూ జీలాండ్ శాఖ , కెసిఆర్ గారికి , తెరాస పార్టీ కి అండగా ఉండేందుకు, గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చెయ్యడానికి నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , మరియు తెరాస NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ఆక్లాండ్ లోని, మౌంట్ ఆల్బర్ట్ లోని. పింక్ రూమ్ లో ప్రత్యేక సమావేశం తెరాస న్యూ జీలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశం లో తెరాస న్యూ జీలాండ్ శాఖ తమ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. త్రీ ముఖ వ్యూహాన్ని ప్రచారానికి అవలంబించబోతున్నట్టు తెలిపారు .

ఏ) చలో తెలంగాణ – ఫర్ కెసిఆర్ (తెలంగాణ లో ఎన్నికల ప్రచారం )

బి) హలొ తెలంగాణ – ఫర్ కెసిఆర్ ( తెలంగాణ లోని ఓటర్లకు ఫోన్ ద్వారా ప్రచారం )

సి) హల్ – చల్ ఇన్ సోషల్మీడియా – ఫర్ కెసిఆర్ ( సోషల్ మీడియా లో భారీ ప్రచారం , విమర్శలు తిప్పి కొట్టడం )

తెరాస హోనోరరీ ఛైర్పర్సన్ కళ్యాణ్ రావు కాసుగంటి, అరుణ్ప్రకాష్ ఆధ్వర్యంలో ఒక బృందం తెరాస న్యూ జీలాండ్ తరపున వచ్చే వారము నుండి మహేష్ బిగాలా ఆదేశాల మేరకు తెరాస పార్టీ అభ్యర్థులతో ప్రచారం లో పాల్గొంటారని తెలిపారు .
కెసిఆర్ గారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తరువాత ఈ బృందం న్యూజిలాండ్ కు తిరిగి వస్తుందని తెలిపారు .తెరాస ఉపాధ్యక్షులు జగన్ రెడ్డి వొదినాల , రామ రావు రాచకొండ లు, విమెన్ అఫైర్స్ చైర్ పర్సన్ సునీత విజయ్ ఆధ్వర్యంలో ఇతర సభ్యులందరు తమ తమ నియోజకవర్గాల వారీగా తెలంగాణ లోని ఓటర్ ల అందరికి ఫోన్ చేసి తెరాస కె వోట్ ఎందుకు వెయ్యాలో వివరిస్తారని తెలిపారు .కెసిఆర్ గారి మాట మీద నిలబడే తత్వం , అభివృద్ధి లో వేగం , సంక్షేమ పథకాల గురించి వివరిస్తారని తెలిపారు .తెరాస జనరల్ సెక్రటరీ నర్సింగ రావు ఇనగంటి , నరేందర్ రెడ్డి పట్లోళ్ల , అభిలాష్ రావు యాచమనేని , కిరణ్ పోకల, ఆధ్వర్యంలో సోషల్ మీడియా లో ప్రచారం తో పాటు , విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ , పేస్ బుక్ , వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ లాంటి అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పటికే ప్రచారం ఉదృతంగా సాగుతోందని తెలిపారు .అందరు సభ్యులు , ఖచ్చితంగా కెసిఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చూస్తాం అని, కానీ మహాకూటమి ని , తక్కువ గా అంచనా వెయ్యకుండా మనం కృషి చేస్తే బారి మెజారిటీ తో పాటు , 90 ఫై చిలుకు స్థానాల్లో విజయం వరిస్తుందని తెలిపారు .ఈ త్రిముఖ వ్యూహాన్ని అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతూ విజయానికి తమ వంతు కృషి జరుపుతామని తెలిపారు .ఈ సమావేశంలో రాజేశ్వరి కొండగారి, పానుగంటి శ్రీనివాస్ , రామ్ మోహన్ దంతాల , సుజిత్ సింగ్ , వరుణ్ రావు మేచినేని , అరుణ్ రావు పైడిగూమ్ముల , శ్రీహరి రావు బండ, అశుతోష్ రెడ్డి వొదినాలతదితరులు పాల్గొన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat