చైనాలో మొదటిసారి ఘనంగా బతుకమ్మ పండుగ – Dharuvu
Breaking News
Home / festival / చైనాలో మొదటిసారి ఘనంగా బతుకమ్మ పండుగ

చైనాలో మొదటిసారి ఘనంగా బతుకమ్మ పండుగ

తెలంగాణ పూల పండుగ “బతుకమ్మ” మరియు దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ షాంఘై మరియు షాంఘై దక్షిణ సంగమం షాంఘైలో నవంబర్ 4 న అట్టహాసంగా జరుపుకొన్నారు.అంతేగాక తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ గురించి మరియు దాని ప్రాముఖ్యత గురించి వీడియో ప్రదర్శన చేశారు. తెలుగు రాష్ట్రాల మహిళలు మరియు దక్షిణ ప్రాంతాల నుండి తెలుగు వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సుజౌ & షౌషింగ్ నుండి తరలి వచ్చారు.చైనాలో మొదటిసారి బతుకమ్మ పండుగను ఈ సంవత్సరం ఘనంగా చాలా సంతోషంతో జరుపుకున్నామని తెలియజేశారు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా గొప్ప స్థాయి లో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటామని ఆశాజనకంగా ఉన్నామన్నారు.టీఆర్ఎస్ చైనా సంఘము నుండి ప్రతిఒక్కరికీ ఉత్సవాలను గొప్పరీతిలో విజయవంతం చేసినందరికి దన్యవాదములు తెలిపారు . ఈ కార్యక్రమంలో జి.వి రవీందర్ రెడ్డి,  విజయ భాస్కర్ రెడ్డి, మధు సూదన్ వర్మ,
కృపాల్ రెడ్డి గోలీ, అవినాష్ గౌడ్, కృపాకర్ రెడ్డి, జై కృష్ణ తూము, సుష్మా రెడ్డి,ముజాహిద్, అశోక్ కుమార్ గుప్తా , శేకర్ జ్యోత్సుల…ప్రశాంతి, రమేష్ రెడ్డి, భాస్కర్, తేజా, ఆనంద్ కుమార్ రెడ్డి తదితరులు ఈ ఉత్సవాలను ఘనంగా విజయవంతం చేశారు .బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న అందరు మహిళలకు కూడా చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.