Breaking News
Home / SLIDER / సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్.ఏముంది అందులో..!

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్.ఏముంది అందులో..!

స‌హాయం అవ‌సరం ఉంటే…ప్రాంతం ఏదైనా…అవ‌స‌రం ఎలాంటి దైనా, అర్ధ‌రాత్రి అయినా, అప‌రాత్రి అయినా… ట‌క్కున గుర్తుకువ‌చ్చేది ఎవ‌రంటే..టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ అనేది నెటిజ‌న్లు, రాజ‌కీయ‌వ‌ర్గాలు, సామాన్యుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం…ఎదురుచూడ‌టం వంటి సాగ‌దీత ప్ర‌క్రియ‌లు లేకుండా..సింపుల్‌గా ఒక ట్విస్ట్‌లో విష‌యం చెప్తే చాలు…కేటీఆర్ స్పందిస్తారు. స‌హాయం చేస్తారు. అలా ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌రంగా స్పందించిన చేసిన స‌హాయాల సంఖ్య వేల‌ల్లో ఉంటుంది.

అయితే, తాజాగా ఆయ‌న చేసిన ప‌ది ల‌క్ష‌ల స‌హాయం వేలాది మంది నెటిజ‌న్ల చేత `కేటీఆర్ మానవ‌తా హృద‌యం ఉన్న గొప్ప మ‌నిషి, నాయ‌కుడు` అనిపించేలా చేసింది. ఇంత‌కీ ఆ ట్వీట్ వివ‌రాల్లోకి వెళిలే….ప్రణీత జొన్నలగడ్డ అనే స్వచ్ఛంద సేవిక హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ అనే పేరుతో ఆమె కొన్నాళ్లుగా అనాథ బాలల కోసం శరణాలయం నిర్వహిస్తున్నారు. త‌న శక్తి మేరకు ఆమె స‌హాయం చేస్తున్నారు. అయితే, ఇటీవ‌ల త‌మ వ‌ద్ద ఉన్న నిధుల‌న్నీ అయిపోవడంతో….ఆమె ఆ పిల్లలు గురించి ఆవేద‌న చెందుతూ ఓ ట్వీట్ చేసింది.

పిల్ల‌లు రోడ్డున పడతారని ఎవరైనా దాతలు ఆపన్న హస్తం అందించాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విష‌యం త‌న దృష్టికి రాగానే, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. స‌హాయం అందించారు. అది ప్ర‌భుత్వ ప‌రంగానో..పార్టీ ప‌రంగానో కాదు. వ్య‌క్తిగ‌తంగా!ఔను. తన వ్యక్తిగత స్థాయిలో రూ. 10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎవరికి, ఎక్కడ ఇవ్వాలో తెలియజేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫునో ఇంకో రూపంలోనో మాత్ర‌మే స‌హాయం చేయ‌గ‌లం త‌ప్ప ఇప్పుడేం చేయ‌లేమ‌ని చేతులు ముడుసుకొని కూర్చోకుండా…త‌న స్వంత డ‌బ్బులు ఇవ్వ‌డం…వివ‌రాలు ఏమీ తెలియ‌కుండానే డ‌బ్బులు ఇచ్చేందుకు ముందుకు రావ‌డం త‌ద్వారా ఆ చిన్నారుల‌కు కొండంత అండ‌గా నిల‌బ‌డ‌టం…కేటీఆర్‌లోని మాన‌వ‌తా హృద‌యానికి ఓ మ‌చ్చుతున‌క అని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.