టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలనాత్మక నిర్ణయం..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలనాత్మక నిర్ణయం..!

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలనాత్మక నిర్ణయం..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈక్రమంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ,కాంగ్రెస్,తెలంగాణ జనసమితి,సీపీఐలాంటి పార్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చి మహకూటమి ఏర్పాటు చేయడంలో ఎల్ రమణ కీలక పాత్ర పోషించారు.

ఈసందర్బంగా సీట్లపంపకం సందర్భంగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టి.జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అదేస్థానం నుండి బరిలోకి దిగాలని ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారు.దీంతో జగిత్యాల నుండి ఎల్ రమణ పోటి చేయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో తాను ఈ ఎన్నికల్లో బరిలోకి దిగను అని ప్రకటించారు. అయితే మహకూటమి అభ్యర్థుల తరపున మాత్రం ప్రచారం చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు..