తెలంగాణ‌కు నీళ్లు అడ్డుకుంటున్నామన్న బాబు కూట‌మికి ఓట్లేద్దామా? – Dharuvu
Breaking News
Home / 18+ / తెలంగాణ‌కు నీళ్లు అడ్డుకుంటున్నామన్న బాబు కూట‌మికి ఓట్లేద్దామా?

తెలంగాణ‌కు నీళ్లు అడ్డుకుంటున్నామన్న బాబు కూట‌మికి ఓట్లేద్దామా?

తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీల‌ను బ‌ల‌ప‌ర్చాలో…తెలంగాణ కోసం నిరంతరం త‌పించే పార్టీకి ఓటు వేయాలనే విష‌యంలో ప్రజలకు స్వస్టత ఉంద‌ని మంత్రి హరీష్‌రావు స్వష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న ఆయన…పాలమూరు -దిండి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి ఉమా భారతికి చంద్రబాబు లేఖ రాశారని…అలా లేఖలు రాసిన చంద్రబాబు ఇక్కడ ఎలా ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఈ ప్రశ్నపై ఆంధ్ర ప్రభుత్వం స్పందించింది… ఖచ్చితంగా పాలమూరు- దిండి ప్రాజెక్టు అడ్డుకుంటామన్నారు… మనం వారికి ఎలా ఓటేస్తామని ప్రశ్నించారు.

మహా కూటమికి ఓటేస్తే మళ్లీ మన అస్తిత్వాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాల్సి వస్తుందన్నారు హరీష్‌రావు… జానారెడ్డి దిండి ప్రాజెక్టు కోసం కష్టపడ్డ అన్నారు… మరి కూటమిలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు… మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేయమని ఏమైన హామీ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కావాలంటే కేసీఆర్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చిన మంత్రి… సంక్షేమానికైతే కేసీఆర్‌కు… సంక్షోభానికైతే మహా కూటమికి ఓటెయ్యాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే డిల్లీకి పోతుంది… టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుంది… టీజేఎస్‌కు ఓటేస్తే ఎటూకాకుండా పోతుందని సెటైర్లు వేసిన హరీష్‌… టీఆర్ఎస్‌కు ఓటేస్తే సంక్షేమంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ చంద్రబాబును ప్రశ్నిస్తే ఉంటా… పదవులను తృణప్రాయంగా వదిలిన వాడిని… నన్ను ఎంత తిడితే అంత గట్టిగా మాట్లాడతానన్నారు.

డిసెంబర్ 7వ తేదీ తర్వాత తెలంగాణలో టీడీపీ ఉండదని మంత్రి హ‌రీష్ రావు జోస్యం చెప్పారు. చేతులు కట్టుకునే వాల్లను కాదు… చెయ్యెత్తి ప్రశ్నించే వాళ్లను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుంటారన్నారు. మహబూబ్‌నగర్ లో వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడి ప్రాంతం సస్యశ్యామలం అయ్యిందని గుర్తుచేసిన హరీష్‌రావు… మనం వలసలు వెళ్లిన వారిని తిరిగి రప్పిస్తే… కాంగ్రెస్ వాళ్లు పొలిమేర దాక పోయిన టీడీపీ వాళ్లను తిరిగి తీసుకువస్తున్నారిన ఎద్దేవా చేశారు.