ప‌వ‌న్‌కు ధైర్యం లేకే తెలంగాణ‌పై ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదా? – Dharuvu
Breaking News
Home / 18+ / ప‌వ‌న్‌కు ధైర్యం లేకే తెలంగాణ‌పై ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదా?

ప‌వ‌న్‌కు ధైర్యం లేకే తెలంగాణ‌పై ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదా?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ వైఖ‌రి తెలంగాణ‌లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒంట‌రిగా బ‌రిలో దిగుతుండ‌గా….కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలు మ‌హాకూట‌మిగా పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇక వామ‌ప‌క్షాల్లోని మ‌రోపార్టీ అయిన సీపీఎం బీఎల్‌పీ పేరుతో వేరే కూట‌మి పెట్టుకొని పోరుబాట ప‌ట్టింది. తాజాగా వైసీపీ తాను తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో అంద‌రి చూపు ప‌వ‌న్‌పై ప‌డింది.

అధికార టీఆర్ఎస్ పార్టీ 105 అభ్యర్థుల‌ను రికార్డు స్థాయిలో ఒకేసారి ప్రక‌టించి ప్రచార ప‌ర్వంలో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ,టీజేఎస్‌, సీపీఐ ద్వారా ఏర్పాటైన కుంప‌టి ఇంకా సిగ‌ప‌ట్లు ప‌డుతోంది. పొత్తులో సీట్లు ఖ‌రారు చేసుకోలేక‌,అభ్యర్థుల‌ను ప్రకటించ‌క స‌త‌మ‌తం అవుతోంది. ఇక వైసీపీ త‌న బ‌లాబ‌లాను అంచ‌నా వేసుకొని పోటీ చేయ‌ట్లేద‌ని ప్రకటించింది. ఇలా ప్రధాన పార్టీలు త‌మ స్టాండ్ వెల్లడించ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన మాత్రం త‌న వైఖ‌రి ఏంట‌నేది ప్రక‌టించ‌లేక‌పోతోంది.

ఏపీలో పర్యాటిస్తూ ఇటీవ‌లే త‌న మ్యానిఫెస్టో ఇది అంటూ ప్రక‌టించిన జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ ఎన్నిక‌ల విష‌యంలో త‌న వైఖ‌రి వెలువడించ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేసే బ‌లం త‌న‌కు లేద‌నే ప‌వ‌న్ ఇలా చేస్తున్నారా? లేక‌పోతే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదా? అనే అంశం ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది.