వ్యభిచారంపై హైకోర్టు సంచ‌ల‌న కామెంట్ – Dharuvu
Breaking News
Home / 18+ / వ్యభిచారంపై హైకోర్టు సంచ‌ల‌న కామెంట్

వ్యభిచారంపై హైకోర్టు సంచ‌ల‌న కామెంట్

వ్యభిచారంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్నారుల్ని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఆరోపిస్తూ యాదాద్రికి చెందిన నలుగురు మహిళలపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం చేయటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించలేమనీ..అటువంటి కేసులపై పీడీ యాక్ట్‌ ప్రయోగం అర్థరహితమని హైకోర్టు స్పష్టం చేసింది.

త‌మ‌ను అరెస్ట్ చేయ‌డాన్ని సవాల్‌ చేస్తూ మహిళ తరపున బంధువులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరును తప్పుపట్టింది. అలజడులు, అశాంతికి కారణమయ్యే తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భాల్లోనే నిందితులపై ఈ చట్టాన్ని ప్రయోగించాలని గుర్తు చేసింది. యాదాద్రిలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిని పట్టుకుని వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడమేకాక, మహిళలను నిర్బంధించి జైలులో ఉంచడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. చట్టం అమలు చేసేటప్పుడు సహేతుకత పాటించాలని, చట్టం పేరుతో మహిళల జీవించే స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు.