Home / 18+ / కోదాడ, హుజూర్‌నగర్‌లో గులాబీ పరుగులు

కోదాడ, హుజూర్‌నగర్‌లో గులాబీ పరుగులు

సూర్యాపేట జిల్లాలో గులాబీ జెండా రెప‌రెప‌లాడుతోంది. ఎన్నికల కదనరంగంలోకి టీఆర్‌ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు దూకి ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో సూర్యాపేట, తుంగతుర్తి టీఆర్‌ఎస్ విజయం సాధించగా కోదాడ, హుజూర్‌నగర్‌లలో కాంగ్రెస్ గెలిచింది. రాజకీయాలకు సం బంధం లేకుండా ప్రతీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించి అభివృద్ది, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతుండడంతో ప్రజలు టీఆర్‌ఎస్ పక్షాన చేరారు. దీంతో త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఇప్పటికే జిల్లాలో సిట్టింగులుగా ఉన్న సూర్యాపేట, తుంగతుర్తిల్లో అధికార టీఆర్‌ఎస్ అవలీలగా గెలవబోతుండగా కోదాడ, హుజూర్‌నగర్‌లలో కూడా గెలుపు ఖాయమనే రీతిన అక్కడి వాతావరణం మారిపోయింది. ఈ రెండు చోట్ల సిట్టింగ్ ఎ మ్మెల్యేలకు ఉన్న వ్యతిరేకత, అధికార టీఆర్‌ఎస్‌కు అనుకూలత అధికంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తరపున పట్టుమని పది మంది కూడా ప్రచారాల్లో కనిపించడం లేదు.

 

కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నాలుగున్నరేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో వారిపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. కోదాడలో ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్యయాదవ్ కొన్ని సమీకరణాల వల్ల టీఆర్‌ఎస్ ఆయనను ఎన్నికల బరిలో నిలిపారు. రాష్ట్రంలోనే కనిపించకుండా పోయిన టీడీపీ కోదాడలో మాత్రం మల్లయ్యయాదవ్ కారణంగా కొంత బలంగానే ఉండగా నేడు 95శాతం టీడీపీ క్యాడర్ బొల్లంతో పాటు గులాబీ గూటికి చేరుకున్నారు. అంతే కాకుండా మల్లయ్యయాదవ్ గత 15 యేళ్లుగా కోదాడలోనే ఉంటూ ఎన్నికల బరిలో నిలిచినా ఓటమి పాలైనందున ఈ సారి అభివృద్ధి మారుపేరైన టీఆర్‌ఎస్‌లో ద్వారా విపరీతమైన సానుభూతి కలసి వస్తుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో కోదాడలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తుంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్‌జానీ టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నా యకు లు ఆవుల రామారావు, ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మారోజు వెంకటేశ్వర్లు, మోతే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అల్తాఫ్ హు స్సేన్‌లు టీఆర్‌ఎస్‌లో చేరగా నియోజకవర్గ వ్యా ప్తంగా 80శాతం స్థానికప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ పక్షాన్నే ఉన్నారు.

హుజూర్‌నగర్ విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలకు అసలే అందుబాటులో ఉండకపోవడం, టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్థానికుడై ప్రజల్లోకి చొచ్చుకొని పో తుండడంతో ఈ సారి హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ విజయం ఖా యమైనట్లుగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉన్నత చదువులు చదివిన సైదిరెడ్డి వివాదరహితుడుగా పేరు సంపాదించి కొద్ది సంవత్సరాలుగా ని యోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మిత్రుల సహాయంతో సై, అంకిరెడ్డి ఫౌండేషన్‌ల ద్వారా లక్షలాది రూపాయలతో నిరుద్యోగ యువతకు కోచింగ్‌లు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అందుబాటులో ఉండకపోగా ఆయనకు ఉన్న ఆవేశంతో ఆ పార్టీ నా యకులు దూరమయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మా త్రం కెనడాలో ఉన్నత ఉద్యోగం చేసి ఆర్థికంగా బలంగా ఉండగా ఆయన ఇండియాకు వచ్చి నియోజవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ మరో పక్క పార్టీ బలోపేతానికి ఎనలేని కృ షి చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ లో చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇతర పార్టీల నుంచి శానంపూడి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని రెండు సార్లు చుట్టి వచ్చిన అభ్యర్థి సైదిరెడ్డి మరోమారు పర్యటిస్తూ రోడ్‌షోలు, ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat