Home / ANDHRAPRADESH / నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కూకట్ పల్లిలో భారీ ఓటమి తప్పదా.? కారణాలివే..!

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కూకట్ పల్లిలో భారీ ఓటమి తప్పదా.? కారణాలివే..!

తెలంగాణ ఎన్నికల గడువు అత్యంత సమీపిస్తున్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే గెలుపు విషయమై ఆ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఆ నియోజకవర్గం పేరు అందరూ తేలిగ్గానే ఊహించగలరు….అవును…అది కూకట్ పల్లి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ కోణం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు విషయమై అంతటి ఆసక్తి నెలకొనడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.ఒక కారణం ఇక్కడ అభ్యర్థి కాగా రెండో కారణం ఈ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్స్ అత్యధిక సంఖ్యలో ఉండటం. ఇక్కడ నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టిడిపి ఎమ్మెల్యేగా బరిలోకి దిగగా టిఆర్ఎస్ తరుపున తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావే పోటీలో ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గం విశిష్టత విషయానికొస్తే తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రా సెటిలర్స్ అత్యధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదైవున్న నియోజకవర్గాల్లో ఇదొకటి. మరోరకంగా చెప్పాలంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఓటములు డిసైడ్ చేసేది సెటిలర్ల ఓట్లే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సామాజిక వర్గాల…ఓట్లు ఇలా కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో 3.37 లక్షల మంది ఓటర్లు ఉండగా దాదాపు రెండు లక్షలమంది ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడినవారే. అయితే తెలంగాణా ఎన్నికల్లో వైసిపి, జనసేన బరిలో లేని క్రమంలో మరి ఇక్కడి ఆంధ్రా సెటిలర్లు టిడిపివైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది… అంతేకాదు ఆంధ్రాలోనే అన్ని పార్టీలు టిడిపిని వ్యతిరేకిస్తున్నాయి. అలాంటిది తెలంగాణలో ఎలా టీడీపీకి ఎలా మద్దతు ఇస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్స్ ఉన్న మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనాడు కించపర్చలేదు. తెలంగాణ ప్రజలతో పాటు మాకు అన్ని సంక్షేమ పథకాలు కాబట్టి…కెసిఆర్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నందమూరి కుటుంబంపై ప్రేమ లేదని, వారి కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాలకు దూరం చేసేందుకు కుట్ర పన్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అందుకే ఓడిపోయే కూకట్‌పల్లి సీటును నందమూరి సుహాసినికి కేటాయించారని అన్నారు.   దీంతో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఓటమీ ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat