Home / 18+ / సీపీఎస్ ప్రీపోల్ సర్వే: కేసీఆర్ దే హవా..వందకు పైగా సీట్లతో విజయకేతనం

సీపీఎస్ ప్రీపోల్ సర్వే: కేసీఆర్ దే హవా..వందకు పైగా సీట్లతో విజయకేతనం

తెలంగాణా ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీ టీఆర్ఎస్‌దే విజ‌యం అని మ‌రో సారి తేలిపోయింది. స్వస్టమైన మెజారిటీతో మ‌రో సారి సీఎం పీఠాన్ని కేసీఆర్ అధిరోహించ‌నున్నారు.చూస్తుండగానే ఎన్నికలు నాలుగు రోజులలోకి వచ్చాయి. గత మూడు మాసాలుగా తెలంగాణాలో ఎన్నికలు, పార్టీల విజయావకాశాల మీద కొంచెం కసరత్తు చెయ్యడం జరిగింది. అనేకమంది వివిధ వర్గాల ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయసేకరణ చెయ్యడం జరిగింది.అయితే నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సీపీఎస్ (సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్) 119 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అభ్యర్థి, పార్టీని లెక్కలోకి తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ చేశారు. సీపీఎస్ మొత్తం 2,86,567 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. 2009 అసెంబ్లీ ఎన్నికలు, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సీపీఎస్ ఇచ్చిన ఫలితాలు నూటికి నూరుశాతం నిజమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతుంది.

టీఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎదురు లేదని సర్వే తేల్చి చెప్పింది. సీపీఎస్ సర్వేలో టీఆర్‌ఎస్ పార్టీ సీట్ల సంఖ్య 100కు పైగా దాటింది. టీఆర్‌ఎస్ పార్టీకి 94 నుంచి 104 వస్తాయని సర్వే తెలిపింది. ఈ ఎన్నికల్లో ప్రాజాకూటమి 16 నుంచి 21 సీట్లకే పరిమితం కానున్నట్లు పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 7 సీట్లు, బీజేపీకి 1 నుంచి రెండు సీట్లు, ఇతరులు ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.టీఆర్ఎస్ పార్టీ ముందు నుండి ప్రజాదరణ ఎక్కువుగానే ఉంది. స‌ర్వేలో ప్రధానంగా 24 గంట‌ల క‌రెంటు, లా అండ్ ఆర్డర్‌, వెల్‌ఫేర్ స్కీమ్స్‌, రైతుల‌కోసం ఏర్పాటు చేయ‌నున్న ఫండ్‌, త్రాగు, సాగునీరు, పెన్స‌స్ లాంటి ప‌థ‌కాలే టీఆర్ఎష్‌ను గెలిపించ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి హంగ్ రాద‌ని ..అధికార పార్టీ టీఆర్ఎస్‌ను నిలువ‌రించ‌డంలో మ‌హాకూట‌మి ఎలాంటి ప్రభావం చూప‌లేద‌ని స‌ర్వే తెలిపింది.ఆ నమ్మకంతోనే తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమకు వంద సీట్లు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటుగా ఆపార్టీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు.ఎంతో ధీమాగా ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat