Home / 18+ / ఔర్ ఏక్ బార్ కేసీఆర్ పక్కా!..ఇదే లెక్కా

ఔర్ ఏక్ బార్ కేసీఆర్ పక్కా!..ఇదే లెక్కా

రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఈ మాట చెప్తోంది ఎవ‌రంటే కాంగ్రెస్ నేత‌ల తీరును గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు. దీనికి తార్కాణం. పార్టీ సీనియ‌ర్లతో ప్రచారం ప్రకారం గెలుపు ఖాయ‌మంటున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మేనిఫెస్టో విడుదల కోసం కూడా ఆందోల్ వదలలేక పోయాడు. నకిరేకల్ ప్రచారానికి రమ్మంటే సమయం లేదు తనను డిస్టర్బ్ చేయొద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేడుకున్నారట. పార్టీ సీనియ‌ర్లైన జీవన్ రెడ్డి, శ్రీధర్‌బాబు హైదరాబాద్ ముఖం చూడక చాలా రోజులే అయింది.

ఇక పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి లాంటి వాళ్లు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోనే చెమ‌ట ఓడుస్తున్నారు. కాగితం పులుల చందంగా కాంగ్రెస్ లో అగ్రనేతలుగా చెలామణీ అవుతున్న వీళ్లంతా ఏటికి ఎదురీదుతుంటే గెలిచేది, టీఆర్ఎస్సా? కూటమా! విశ్లేషించండి విజ్ఞులైన ప్రజలారా రాజకీయ పండితులారా! కూకట్ పల్లిలో సుహాసిని కోసం చంద్రబాబు బాలక్రిష్ణలు 4 రోజులుగా గల్లీ, గల్లీ తిరిగి చెమటోడ్చాల్సి వస్తోంది. అటు కేసీఆరేమో సులువుగా 100 సభలు పూర్తి చేశాడు. ఇటు కేటీఆర్, హరీష్ లు చెరోవైపు విస్తృతంగా సభలు, రోడ్ షోలు, సమావేశాల్లో పాల్గొంటుంటే గెలుపెవరిని వరిస్తుంది! ఇంత క్లియర్ గా కాంగ్రెస్ అగ్రనేతల దీనస్థితి కనిపిస్తుంటే, గెలుపు బాటలో ఎవరున్నట్టు? మరి అలాంటప్పుడు దొంగ సర్వేలతో గందరగోళ పడటం, అనుమానాలకు తావివ్వడం ఎందుకు? అందుకే తెలంగాణాలో *ఔర్ ఏక్ బార్ కేసీఆర్ పక్కా!*