Home / 18+ / అరెస్ట‌యిన రేవంత్‌..అయినా తగ్గని అహంభావం

అరెస్ట‌యిన రేవంత్‌..అయినా తగ్గని అహంభావం

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభను నిర్వహించనున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వివాదం సృష్టించే ప్రయ‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. సభకు సీఎం కేసీఆర్‌ హాజరయి ప్రసంగించనున్న నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి మంగళవారం బంద్ కు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోస్గి, కొడంగల్ లలో భారీగా పోలీసులు మోహరించారు. భద్రత దృష్ట్యా అక్కడ 144 సెక్షన్ ను అమలు చేశారు.

కాగా, భద్రత సంబంధ‌మైన చ‌ర్య‌ల్లో భాగంగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు భారీ బందోబస్తు మధ్యం జడ్చర్లలోని డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి తరలించారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో రేవంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎక్కడికి తీసుకెళ్లారనే విషయమై కాస్త గందరగోళం నెలకొంది. ‘రేవంత్‌ని చూపించండి’ అంటూ ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి ఎక్కడికి తరలించారో చెప్పాలని ఆయన సతీమణి గీత డిమాండ్‌ చేశారు. 8 గంటలుగా ఓపికగా ఉన్నామని.. కుటుంబసభ్యులతో పాటు రేవంత్‌ అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో పోలీసుల అదుపులో రేవంత్‌ సురక్షితంగా ఉన్నారని ఎస్పీ అన్నపూర్ణ ప్రకటించారు. రేవంత్ ను ఎక్కడికి తీసుకెళ్లారనే విషయమై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు.

కాగా, విడుద‌లైన అనంత‌రం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ఎస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న అధికారుల‌ను వ‌ద‌ల‌బోమ‌న్నారు. అధికారుల వివ‌రాలు రాసి పెట్టాల‌ని కోరిన రేవంత్ వారిని జైలుపాలు చేస్తామ‌న్నారు.