Home / 18+ / ఆంధ్ర శని కావాలంటే కూటమికి ఓటేయండి

ఆంధ్ర శని కావాలంటే కూటమికి ఓటేయండి

తెలంగాణ‌లో హోరాహోరీ పోరు జ‌రుగుతున్న స‌మ‌యంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువకేంద్ర జాతీయ వైస్‌చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లగడపాటి డ్రామా సర్వేలను ఎవరూ నమ్మబోరన్నారు. తెలుగుదేశం నాటకంలో సూత్రధారి, పాత్రదారి లగడపాటి అని విమర్శించారు. “కూటమి గెలిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొస్తామని టీడీపీ నేతలు బాహాటంగా చెప్తున్నారు. ఆంధ్రలో మాకుపట్టిన శనిని తెలంగాణ ప్రజలు తీసుకుంటామంటే అభ్యంతరంలేదు. టీడీపీ శనిని వదిలించుకోవాలని ఆంధ్రప్రజలు అనుకుంటున్నారు“ అని అన్నారు.

కూటమి పేరుతో దొంగలు అందరూ కలిశారని వ్యాఖ్యానించారు.ఎన్నికల్లో పోటీచేయకుండా పారిపోయిన లగడపాటి మీడియాలో చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నావు? ఎంతకు అమ్ముడుపోయావు? ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? లగడపాటి దానికి అతీతుడా? అతడిని వెంటనే అరెస్ట్ చేయాలి. సుమోటో కేసు నమోదు చేయాలి` అని డిమాండ్ చేశారు. ఆంధ్రలో ప్రజల సొమ్మును దోచి ఇక్కడ గాంధీభవన్ సాక్షిగా ఖర్చు పెడ్తున్నారని ఆరోపించారు. కూటమి నేతలకు సంబంధించిన రూ.కోట్లు పట్టుపడుతుండటం ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి నేతలంతా తెలంగాణ, ఆంధ్ర ద్రోహులని ఆరోపించారు.