Home / 18+ / నా ఒక్క ఓటు వల్ల ఎన్నికలు ఆగిపోతాయా అనేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

నా ఒక్క ఓటు వల్ల ఎన్నికలు ఆగిపోతాయా అనేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

ఓటును ఎవ్వరూ తేలికగా తీసుకోకూడదు.. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన ఓటు అనే మన హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి.నా ఒక్క ఓటు వల్ల ఏం అవుతుంది అని నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లుతుంది.

ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపోలేదు.
గత 2008లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషీకి 62,215 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్‌కి 62,216 ఓట్లు వచ్చాయి. అయితే, కొందరు టెండర్ ఓటు వేశారని కోర్టు దాకా వెళ్లడంతో తిరిగి లెక్కించగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయడంతో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్‌ను గెలుపు వరించింది.

అదేవిధంగా 2004లో కర్నాటకలోని సంతేమరహళ్ళి స్థానంలో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. ధృవ్‌నారాయణ్‌కు 40,752 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో కృష్ణమూర్తి ఓటమిపాలయ్యారు. అందుకే ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనదేనని రాజ్యంగ నిపుణులు అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat