Home / POLITICS / అరూరి రమేష్ కు లక్ష మెజారిటీ-దరువు లేటెస్ట్ సర్వే..

అరూరి రమేష్ కు లక్ష మెజారిటీ-దరువు లేటెస్ట్ సర్వే..

తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు దేశమంతా రేపు మంగళవారం విడుదల కానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొన్నది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల కంటే రెండు శాతం ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. మొత్తం పదమూడు వందల మంది అభ్యర్థులు బరిలోకి ఉండగా కేవలం ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల మధ్యనే పోరు ఉంది.గత వారం రోజులుగా విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనుకూల మీడియాగా ముద్ర పడిన పచ్చమీడియా ప్రచారం చేస్తుంది.అయితే గులాబీ శ్రేణులు మాత్రం తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. గులాబీ శ్రేణులు గెలుపు కంటే మెజారిటీల గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలో ఎవరి ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందని అనే అంశం మీద సర్వే నిర్వహించగా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన అరూరి రమేష్ తన సమీప ప్రత్యర్థిపై లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని తేలింది. ఈ క్రమంలో

అందులో భాగంగా ప్రస్తుతం సిద్దిపేట నుండి బరిలోకి దిగిన తన్నీరు హారీష్ రావు లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొందుతారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యనిస్తుండగా మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో తన్నీరు హారీష్ రావు తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థిగా వర్ధన్నపేట నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందనున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు..ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందే మొదటి స్థానం వర్ధన్నపేట నియోజకవర్గం అని కూడా తేల్చి చెప్పాయి పలు సర్వేలు..

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే ,ఆ పార్టీ అభ్యర్థి అరూరి రమేష్ ఏకంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తర్వాత(94,000వేల మెజారిటీ) మొత్తం ఎనబై నాలుగు వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టిస్తూ తెలంగాణ తొలి అసెంబ్లీలో అడుగెట్టారు .గత నాలుగేళ్ళుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయడంలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నారు..

ఆసరా దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు,గురుకులాల నుండి విదేశీ విద్యకు పేదల విద్యార్థులకందించే ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ వరకు,మిషన్ కాకతీయ నుండి వరంగల్ జిల్లాకు నీళ్ళందించే కాళేశ్వరం వరకు,రైతుబంధు నుండి రైతు రుణాల మాఫీ వరకు,గ్రామాలల్లో పల్లెల్లో సీసీ రోడ్ల నుండి రహదారుల వరకు ,అమ్మఒడి నుండి సీఎంఆర్ఎఫ్ వరకు ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంలో నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను అందుకున్నారు అరూరి రమేష్ .గతంలో ఎవరు చేయని విధంగా నియోజకవర్గాన్ని ఇటు అభివృద్ధిలో అటు సంక్షేమంలో మొదటిస్థానంలో నిలిపినందుకు జిల్లాలో లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందే తొలి ఎమ్మెల్యే అరూరి రమేష్ అని నియోజకవర్గంలో,జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat