డేటింగ్ చేసేవాళ్ళు ఇది తప్సనిసరిగా తెలుసుకోండి!! – Dharuvu
Home / 18+ / డేటింగ్ చేసేవాళ్ళు ఇది తప్సనిసరిగా తెలుసుకోండి!!

డేటింగ్ చేసేవాళ్ళు ఇది తప్సనిసరిగా తెలుసుకోండి!!

‘డేటింగ్‌’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్‌ స్నేహాలు… ఫేస్‌బుక్‌ ప్రేమలు… టిండర్‌ డేటింగ్‌లు ఇప్పుడు ఇక్కడ కూడా సర్వసాధారణం అయ్యాయి. ఆధునిక పోకడలను అవపోసన పడుతున్న నవతరం తమ సోల్‌మేట్‌ కోసం డేటింగ్‌ను నమ్ముకుంటోంది.యుక్తవయసు వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, బంధం ఏర్పరచు కునేందుకు.. ఒకటి కంటే ఎక్కువసార్లు వ్యక్తిగతంగా కలుసుకోవడాన్ని డేటింగ్‌ అంటారన్న సంగతి విదితమే! అయితే, డేటింగ్‌ యాప్స్‌ను పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కబుర్ల కోసం ఉపయోగిస్తుండగా.. భారతదేశంలో ఎక్కువ గా యువత డేటింగ్‌ యాప్స్‌ ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.
మనదేశంలో అబ్బాయిల సంఖ్య కంటే.. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. తాజా సర్వేలో తేలింది ఏమిటంటే.. డేటింగ్ యాప్ లలో ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు అబ్బాయిలు పడుతున్నారట.

ఆ యాప్ వాడే ఒక్కో అమ్మాయి వెంట..కనీసం ముగ్గురు అబ్బాయిలు పడుతున్నారట.భారత్ లో డేటింగ్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో 26 శాతం మందే మహిళలు ఉన్నట్లు ‘వూస్‌’ అనే దేశీయ డేటింగ్‌ యాప్‌ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది.అమెరికాలో టిండర్, బంబుల్‌ డేటింగ్‌ యాప్స్‌ను 40 శాతం మంది మహిళలను ఉపయోగిస్తున్నారు.
విదేశాల్లో డేటింగ్ యాప్స్ ని టైమ్ పాస్ కోసంవినియోగిస్తారు..కాని భారత్ లో మాత్రం సీరియస్ గా డేటింగ్ చేయాలనే వినియోగిస్తున్నారని సర్వేలో తేలింది. 32శాతం మంది సీరియస్ రిలేషన్ కోసం ఈ యాప్స్ లో ట్రై చేస్తుండగా.. 28శాతం మాత్రం కొత్తవారితో పరిచయం కోసం వాడుతున్నారని తేలింది.18నుంచి 21 వయసుగల అబ్బాయిలు మాత్రం.. అమ్మాయిలతో స్నేహం కోసం ఈ యాప్స్ వినియోగిస్తున్నట్లు తెలపడం విశేషం.

ఇక పోతే.. ఈ డేటింగ్ యాప్స్ లో చాలా మంది తన నిజమైన డీటైల్స్ పొందరుపరచడం లేదట. అమ్మాయిలు భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫేక్ డీటైల్స్ ఇస్తున్నారని తెలిసింది.రానున్న రోజుల్లో యువతరం ఇంకా ముందుకు వెళ్తుందని తెలుస్తుంది.అయితే ఫేస్‌బుక్‌ డేటింగ్‌ యాప్‌ వల్ల నిపుణులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.దీనికి ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకర్‌బెర్గ్‌ సమాధానం కూడా చెప్పారు.