Home / ANDHRAPRADESH / చంద్రబాబు వ్యూహాన్ని పసిగట్టిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ ..ఏం జరిగిందో తెలుసా

చంద్రబాబు వ్యూహాన్ని పసిగట్టిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ ..ఏం జరిగిందో తెలుసా

నందమూరి హరికృష్ణను తన రాజకీయ వ్యూహంలో పావుగా వాడుకుని బలి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కుమార్తె సుహాసినిని అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించి బలి చేశారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. హరికృష్ణ కుమార్తె సుహాసినిని తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్టీఆర్‌ కుటుంబంలో తన పట్ల వ్యతిరేకతతో ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు చెక్‌ పెట్టాలని బాబు వ్యూహం రూపొందించారని, తద్వారా హరికృష్ణ ఇంట్లోనూ విభేదాలను రాజేశారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కూకట్‌పల్లి స్థానం నుంచి హరికృష్ణ కుమారుడు, సినీ నటుడు కల్యాణ్‌రామ్‌ను పోటీ చేయించాలని తొలుత బాబు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ద్వారా కల్యాణ్‌రామ్‌పై ఒత్తిడి తెచ్చారు. కల్యాణ్‌రామ్‌ ఒప్పుకోకపోవడంతో అనూహ్యంగా ఆయన సోదరి సుహాసినిని తెరపైకి తీసుకొచ్చారు. కూకట్‌పల్లి నుంచి గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా తన రాజకీయాల కోసం బాబు ఆమెను పోటీ చేయించి ఘోర పరాజయంతో మరింత కుంగదీశారని టీడీపీ సీనియర్‌ నేతలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయే చోట ఆయన కుమార్తెను బరిలోకి దించడం కచ్చితంగా బాబు చేసిన మోసమేనన్న వాదన వినిపిస్తోంది.

చంద్రబాబు వలకు చిక్కని కల్యాణ్‌రామ్‌
కొద్దిరోజుల క్రితం నందమూరి హరికృష్ణ మృతి చెందినప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు చంద్రబాబు పట్ల అయిష్టత కనబరిచారు. అయినా పట్టువీడకుండా కల్యాణ్‌రామ్‌ను టీడీపీ పొలిట్‌బ్యూరోలో చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కల్యాణ్‌రామ్‌ ఆయన వలలో పడలేదు. తననూ వాడుకుని వదిలేస్తారనే అభిప్రాయంతో ఆయన చంద్రబాబు ప్రతిపాదనకు అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుహాసినిని ఎన్నికల రంగంలోకి దించారు. సుహాసిని పోటీ చేయడం ఆమె కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదని సమచారం. ఇకపోతే చంద్రబాబు వ్యూహాన్ని పసిగట్టిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తమ సోదరికి మద్దతుగా పత్రికా ప్రకటన విడుదల చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టలేదు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కారణంగా హరికృష్ణ కుమార్తె ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat